ఇప్పుడు సీతాఫలం వచ్చే సీజన్. సీతాఫలం ఇష్టపడని వారు వుండరు.చాలా మందికి సీతాఫలం, రామఫలం తెలుసు కానీ కృష్ణఫలం తెలియదు. కృష్ణ ఫలం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అన్నింటి కన్నా ఎక్కువగా రోగ నిరోధక శక్తి పుష్కలంగా అందుతుంది. అలాంటి కృష్ణ ఫలం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ పండు చాలా మెత్తగా, రుచికి తీయగా, పుల్లగా ఉంటుంది.ఇందులో శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,సి వంటివి పుష్కళంగా ఉంటాయి.
 
చాలా మంది డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తినరు. అది తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, కానీ కృష్ణ ఫలం వల్ల అలాంటి అనారోగ్య సమస్యలేమీ కలగవు. ఈ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు అధిక పీచు పదార్థం ఉంటాయి.షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అధిక పైబర్ కొంచెం తిన్న,కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
 
చర్మసమస్యలకు నివారిణిగా పని చేస్తుంది.ఇందులో వున్న విటమిన్ ఎ, విటమిన్ సి, రిబోఫ్లేవిన్ మరియు కెరోటిన్ వంటి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

కృష్ణ ఫలం లో విటమిన్ సి, బీటా-క్రిప్టోక్సంతిన్ మరియు ఆల్ఫా కెరోటిన్ ఉన్నాయి.దీనిని తరుచుగా తీసుకోవడం వల్ల ఇందులో వున్న ఐరన్ ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది.గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటే, అలాంటి వారు ఈ ఫలం ను రోజు తినడం వల్ల రక్త హీనత తొందరగా తగ్గుతుంది.
 
ఈ పండులో విటమిన్ b6 మరియు నియాసిన్ పుష్కళంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులో వున్న విటమిన్ b6 వల్ల ఋతుక్రమం సక్రమంగా రావడానికి సహాయపడుతుంది ఫినోలిక్ సమ్మేళనాలు మరియు ఆల్కలాయిడ్స్ కూడా ఒత్తిడిని తగ్గించి, బీపీ మరియు గుండె సంబంధిత రోగాలు రాకుండా నివారిస్తుంది.
 
కృష్ణ ఫలంలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్,ఫాస్పరస్, పొటాషియం మరియు సోడియం వంటి ఖనిజాలు పుష్కాళంగా లభిస్తాయి. ఈ ఖనిజాలు ఎముకలను దృఢపరిచి,ఆస్తియోపొరోసిస్ వ్యాధి నుండి కాపాడుతాయి.ఇందులో వున్న మెగ్నీషియం కండరాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.ఇందులో వున్న అధిక పైబర్ వల్ల, అధిక బరువును తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: