మనం చర్మ సంరక్షణ కోసం పైన పైన లేపనాలు ఎన్నో పూస్తూ ఉంటాము. మన చర్మ సంరక్షణ తినే ఆహారం మీద అధికంగా ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం అధిక గ్యాలరీలు ఉన్నది తిని, మంచి లేపనాలు చర్మంపై పూస్తామంటే సరిపోదు కదా.. మనం నిత్యావనంగా కనిపించాలి అంటే కొన్ని రకాల పండ్లు కూరగాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొన్ని పండ్లు చర్మ సమస్యలకు చెక్ పెడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 ఆరెంజ్ విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది లోపలి నుండి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే, నారింజలో సహజ సిట్రస్ ఆయిల్ ఉండటం వల్ల,కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది అకాల వృద్ధాప్య ఛాయాలను నిరోధిస్తుంది.

దానిమ్మలో విటమిన్ సి, కె మరియు ఫోలేట్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉన్నాయి . ఇవి చర్మాన్ని UV కిరణాలు నుండి కాపాడుతాయి.మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

యాపిల్ రోజుకు ఒకటి తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా మరియు అందంగా తయారవుతుంది . యాపిల్‌లో ఉండే విటమిన్ ఎ మరియు సి,యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి.ఇవి చర్మసమస్యలను తొలగించడంతో పాటు, కాంతి సంతరించుకునేలా చేస్తుంది.

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో దోసకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.దోసకాయ చర్మం పై గల మృతకాణాలు తొలగించడంలో సహాయపడతాయి.మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల అలెర్జిలను దూరం చేస్తాయి.దోసకాయలో విటమిన్ సి మరియు కె పుష్కళంగా ఉండటం వల్ల చర్మం అధికంగా ఉంటుంది.

అరటిపండులో అధిక ఫైబర్, విటమిన్లు ఎ, సి, కె, ఇ మరియు ఫోలేట్ కు గని అని చెప్పవచ్చు. అలాగే, ఇందులో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. అరటిపండు సహజమైన మాయిశ్చరైజర్ మరియు యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: