రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకి వెళ్లవలిసిన పనిలేదు అంటారు. అంటే యాపిల్ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని అర్ధం. అయితే ఈరోజుల్లో నిజానికి యాపిల్ పంటలో కృత్రిమ ఎరువులు చాలా ఎక్కువ వాడతారు. ఒక వేళ మీరు ఎక్కువ యాపిల్ తింటూ ఉంటే చాలా ఎక్కవ పెస్టిసైడ్స్ మీ శరీరంలోకి పంపుతున్నట్లని అర్ధం.ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే ఈ యాపిల్ పండులో అధిక సంఖ్యలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మనకు ఇన్ స్టంట్ శక్తినిస్తాయి. ఇన్స్టంట్ ఎనర్జీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందువల్ల కొవ్వు పెరుగుతుంది.అలాగే పళ్లు కూడా దెబ్బ తింటాయి..ఇక మీరు ఎక్కువగా యాపిల్స్ తింటే దానిలో ఉండే ఎసిడిక్ కంటెంట్ మీ పళ్లపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.అయితే రోజుకు ఒకటి లేదా రెండు తింటే ఇబ్బంది లేదు కాని.. అతిగా తింటే మాత్రం తప్పకుండా ఇబ్బందుల్లో పడతారు.ఇక మాములుగా గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారు యాపిల్ పండ్లు తినకపోవడమే వారి ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండే ఈ పండుతో జీర్ణ వ్యవస్థ బాగా నెమ్మదిస్తుంది.యాపిల్ లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.దీనిని ప్రతి రోజూ కూడా తినడం వల్ల సెయిరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తి అయ్యి శరీరానికి శక్తినిస్తుంది. అయితే యాపిల్ పండ్లు చాలా ఎక్కువగా తిన్నప్పుడు ఆ కార్పొహైడ్రేట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో విడుదలయ్యి.. షుగర్ ను చాలా ఎక్కువగా పెంచేస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు దీనిని దృష్టిలో పెట్టుకోని యాపిల్ తినడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. మనిషి ఆరోగ్యంగా వుండాలంటే రోజుకు 20 నుంచి 40 గ్రాముల ఫైబర్ అవసరం. వయస్సును బట్టి అది 70 గ్రాములు కూడా ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్ పండ్లతో ఆ ఫైబర్ శరీరానికి సరిపోతుంది.అంతకన్నా ఎక్కువైతే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి మలబద్ధకానికి దారితీస్తుంది.కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: