సాధారణంగా మన శరీరానికి ఇన్ఫ్లమేషన్ బ్యాక్టీరియా వైరస్,ఫంగస్ వల్ల కలుగుతాయి.వీటివల్ల మన శరీరానికి జలుబు,దగ్గు వంటి చిన్న రోగాల నుంచి క్యాన్సర్ అనే పెద్ద రోగం వరకు చుట్టుముడతాయి. ఈ రోగాలన్నీ వచ్చిన తర్వాత అనేక మందులు వాడినా ప్రయోజనం కలగకపోగా అనేక ఇతర రోగాలకు దారితీస్తున్నాయి.ఈ రోగాలు అన్నిటిని మన శరీరాన్ని తాకకముందే, నివారించుకోవడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఆహారాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 యాంటీఇన్ఫ్లమేటరీగుణాలు విటమిన్ ఏ, సి,ఈ, పాలిపినల్స్,టర్బీనాయిడ్స్,ఫ్లవనాయిడ్స్, క్వినోన్, వంటి రూపంలో ఉంటాయి.ఈ గుణాలు అధికంగా ఉడికించని ఆహారంలో లభిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఆహారాలను ఉడికించడం వల్ల, గుణాలు తగ్గిపోతాయి. కావున కొన్ని రకాల పదార్థాలను ఉడికించుకుండా డైరెక్ట్ గా తినడం మన శరీర ఆరోగ్యానికి మంచిది.

బాదాం..
బాదాంలో విటమిన్ ఏ, ఈ,అధికంగా ఉండడం వల్ల, ఇవి మనం తీసుకున్నప్పుడు, ఆంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు సక్రమంగా మన శరీరానికి  అంది, క్యాన్సర్ ను కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

టమోటా..
టమోటా లో విటమిన్ సి, పొటాషియం మరియు లైకోపీన్ పుష్కళంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్,మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా,వైరస్ తో పోరాడి, ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతాయి.

డార్క్ చాక్లెట్..
ఇది వాపును కలిగించే బ్యాక్తిరియతో పోరాడే  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీనిని తగిన మొతాదులో రోజూ తీసుకోవడం వల్ల,ఇందులోని
ఫ్లావనోల్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అవకాడోలు..
అవోకాడోలు పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు మోనోశాచురేటెడ్ కొవ్వులు, కెరోటినాయిడ్స్ మరియు టోకోఫెరోల్‌లను వంటివి పోషకాలు పుష్కళంగా ఉంటాయి.ఈ ఇన్ఫ్లమెటరీ గుణాలు క్యాన్సర్ మరియు అలెర్జీలను రాకుండా కాపాడుతాయి.

గ్రీన్ టీ.
గ్రీన్ టీ తాగడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి, ఊబకాయం వంటి రోగాలను తగ్గించడానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కళంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: