ఇతర పండ్ల వలె బొప్పాయి పండు కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. అయితే చాలా మంది ఈ పండును తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇది రుచిగా ఉన్నప్పటికి దీనిని చాలా మంది ఇష్టంగా తినరు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం బొప్పాయి పండును కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇంకా అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ బొప్పాయి పండులో ఉండే లైకోపిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఇంకా అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంకా శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఇలా చాలా రకాలుగా బొప్పాయి పండు  సహాయపడుతుంది. ఇక మధ్యస్థంగా ఉండే బొప్పాయి పండులో 152 గ్రాముల పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో 60 క్యాలరీల శక్తి, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రోటీన్, 157 శాతం విటమిన్ సి, 33 శాతం విటమిన్ ఎ, 14 శాతం ఫోలేట్, 11 శాతం పొటాషియం వంటి పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


బొప్పాయి పండును తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, విటమిన్, విటమిన్ బి9 ( ఫోలేట్), పొటాషియం వంటి పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడితో పాటు శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇంకా కంటి చూపును పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బొప్పాయి పండు మనకు సహాయపడుతుంది.ఇంకా అంతేకాకుండా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు.ఇక ఈ విధంగా బొప్పాయి పండు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని దీనిని కూడా తప్పకుండా ఇతర పండ్ల వలె ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి గర్భిణీ స్త్రీలు మాత్రం దీనిని తీసుకోకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: