వేసవి వచ్చిందంటే చాలు చాల మంది చల్లటి పానీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక వేడి నుండి ఉపశమనం పొందటానికి ఎక్కువగా కూల్ డ్రింక్స్ ను ఆశ్రయించడం కంటే.. సహజమైన డ్రింక్స్ తయారీ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇక వేసవి డ్రింక్ లో ఒకటి ‘నన్నారి షర్బత్’ . దీనినే కొన్ని చోట్ల సుగంధి షోడా అంటారు. దీనిలో శబ్జా గింజలు నాన పెట్టి కలిపి తాగితే.. శరీరం చల్లబడుతుంది.