మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత కారణంగా ఒత్తిడి, తలనొప్పి శరీరం భారంగా అనిపించడం కోపం  చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత కారణంగా చాలామంది నీరసించిపోయి ముఖమంతా పాలిపోయినట్టు కనిపిస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు  ఎదురుకావచ్చు. ముఖ్యంగా శరీర రక్తంలో హిమోగ్లోబిన్ లోని ఎర్ర రక్తకణాలు స్థాయి తగ్గినప్పుడు రక్తహీనతకు కారణమవుతుంది. ఇప్పుడు ఎండు ద్రాక్ష ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు రక్తహీనతను ఎండుద్రాక్ష నీరు తాగితే ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, అందులో ఎండుద్రాక్షలను వేయాలి. రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఎన్నో మంచి ఫలితాలు మన శరీరానికి చేకూరుతాయి. ఈ నీటిలో ఎక్కువగా ఇనుము రాగి బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తహీనతను పూర్తిగా నయం చేయడానికి సహాయ పడుతుంది. అంతేకాకుండా ఈ నీటిలో విటమిన్ ఏ బీటా-కెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది.కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం ఎండు ద్రాక్షలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల కంటిచూపు బలపడుతుంది.

 ఈ నీటిలో కరిగే ఫైబర్ ఉండటం వల్ల కడుపు ని శుభ్రపరిచి గ్యాస్ తో పాటు ఆమ్లత ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ నీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించి, నీరసం అలసట కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ నీరు సహజంగా హిమోగ్లోబిన్ లో ఎర్ర రక్త కణాలు స్థాయిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఫలితంగా ఈ నీటిని తాగడం వల్ల ఎర్ర రక్త కణాలు స్థాయి పెరిగి రక్తహీనత క్రమంగా తగ్గుతుంది.

ఎప్పుడైనా అతి విరోచనాలు కలిగినప్పుడు ఎండు ద్రాక్షలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.ఇలా చేయడం వల్ల రక్తహీనతను తగ్గించి,శరీరంలో శక్తిని పెంచవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: