సాధారణంగా పరీక్షలు వస్తున్నాయి అంటే చాలు విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిలో ఎంత చదివినా కూడా బుర్రకు ఎక్కదు.  ఎలాగైనా సరే కష్టపడి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా చదివేవేస్తుంటారు. మరికొందరైతే ఈ ఒత్తిడితో భోజనం చేయడం కూడా మర్చిపోతారు. ఈ చర్యలు అన్ని జ్ఞాపక శక్తికి వ్యతిరేకంగా పని చేస్తాయి అన్న సంగతి మీకు తెలుసా, అయితే పరీక్షల సమయంలో, ఒత్తిడి సమయంలో జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి. అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



 సరిగా నిద్ర లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్,స్వీట్స్ ఇవి అన్ని బ్రెయిన్ పవర్ కు విలన్లు. కాబట్టి ప్రతిరోజు నిద్రపోవడం, తినడం, చేసుకోవడం ఇలా ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అలాగే మనం తినే కొన్ని ఆహారాలు, అలవాట్లు మెమరీ పవర్ ను పెంచడమే కాకుండా మిమ్మల్ని అప్రమత్తంగా కూడా ఉంచుతాయి. అలాగే పరీక్షల సమయంలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి దోహదం చేస్తాయి.ఆకు కూరలు, కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. కానీ, చాలామందికి అవి రుచించవు. దీంతో ఆకు కూరలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అయితే, అవి కళ్లు, మెదడుకు చాలామంచివి. మీరు ఒక వేళ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా ఆకు కూరలను, కాయగూరలను ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి.


ఆకు పచ్చ కూరగాయాల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతుంది.శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ప్రోటీన్లు తప్పనిసరి. ఎందుకంటే అవి శరీరానికి ఇంధనంలా పనిచేస్తాయి. వాహనం ముందుకు నడవాడని ఇంధనం ఎంత ముఖ్యమో శరీరం సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్లు అంత అవసరం. ప్రోటీన్లు కణాలను నిర్మించి మెమరీ పవర్‌ను పెంచుతాయి. శక్తిని పెంపొందిస్తాయి. మీ శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల చొప్పున ప్రోటీన్లు తీసుకోవాలి.పరీక్షలకు ముందు ఎక్కువ తీపిగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. ముఖ్యంగా కేకులు, చాక్లెట్లు తీపి పదార్థాలు మీకు వెంటనే శక్తిని ఇవ్వచ్చు. అయితే, కొద్ది సేపటి తర్వాత మీ శక్తిని ఒక్కసారే పడిపోయేలా చేస్తాయి.


 దీనివల్ల మీలో అలసట, మతిమరుపు ఏర్పడుతుంది.రోజూ రాత్రి వేళల్లో 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. దీనివల్ల మీరు చదివినది ఎక్కువ సేపు గుర్తుండిపోతుంది.కేవలం పరీక్షల సమయంలోనే కాదు. సాధారణ రోజుల్లో కూడా నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది.ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, తిమ్మిరి వంటివి కూడా దరిచేరవు. దీనివల్ల మీరు హాయిగా పరీక్షలు రాసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: