భోజనం చేసిన తర్వాత తమలపాకులు తీసుకోవడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. అంతేకాకుండా తెల్ల రక్తకణాలు, లింపోసైట్స్ లను పెంచడంలో దోహదపడుతుంది. శరీరానికి చెడు చేసే బ్యాక్టీరియాలను తొలగిస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
చుండ్రు బాధపడే వాళ్ళు తమలపాకును ముద్దగా నూరి తలకు బాగా పట్టించి తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే తలనొప్పి తో బాధపడే వాళ్ళు తమలపాకు రసమును ముక్కులో డ్రాప్స్గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
నొప్పి ఉన్నచోట తమలపాకును వేడిచేసి కట్టు కట్టు కోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అలాగే జ్వరంతో బాధపడుతున్న వాళ్లు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మిరియాలపొడి కలిపి చేసుకుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకు తినడం వల్ల లాలాజలం విడుదలై దప్పిక తీరుతుంది. అంతేకాకుండా గుండె అపసవ్యంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని ప
టీ స్పూన్ మోతాదులో తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రతిరోజు రెండు నెలల పాటు ఒక తమలపాకును 10 గ్రాముల మిరియాల గింజలను కలిపి తిని చల్ల నీళ్లు తాగుతూ ఉంటే బరువు తగ్గి నాజూకుగా తయారవుతారు.
బోధ వ్యాధితో బాధ పడే వాళ్ళకి తమలపాకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతి రోజు ఏడు తమలపాకులను ఉప్పుతో కలిపి నూరి వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల బోధ వ్యాధి తగ్గుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి