ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అని సూచిస్తూ ఉంటారు   అయితే ఇలా శరీరానికి కావలసిన అన్ని రకాల ప్రొటీన్లను ఎలాంటి ఆహారం అందిస్తుంది అనే విషయాలను కూడా చెబుతూ ఉంటారు. అయితే నిపుణులు  సూచించే ఆహారాలలో మొదటగా చేపలు ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చేపలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఎన్నో ప్రొటీన్లు లభిస్తాయి అని చెబుతున్నారు నిపుణులు.  అంతేకాకుండా  ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెబుతూ ఉంటారు.


 పాలు చేపలు ఎన్నో పోషకాలు ఉన్న ఆహారాలు అన్నది అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక శరీర దృఢత్వం కోసం పాలు చేపలు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడానికి మాత్రం అందరూ వణికి పోతూ ఉంటారు. ఎందుకంటే పాలు చేపలు ఒకే సారి తీసుకోవడం వల్ల ఆహార పదార్థాలు శరీరంలో ఎన్నో అనర్థాలకు కారణం అవుతాయి అని ఎన్నో అపోహలు తో ఉంటారు జనాలు. గతంలో పలువురు నిపుణులు కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా చేశారు.



 అయితే తాజాగా పరిశోధకులు ఇక ఈ విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ  ఇచ్చారు. పాలు చేపలు కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు రావడం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రావడం లాంటివి జరుగుతాయి అన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటూ శాస్త్రవేత్తలు తెలిపారు.  శాస్త్రీయంగా చెప్పాలి అంటే పాలు చేపలు కలిపి తీసుకోవడం వల్ల అనర్థాలు జరుగుతాయి అన్న విషయం ఎక్కడ ఏ అధ్యాయనంలో రుజువు కాలేదు అంటూ చెబుతున్నారు నిపుణులు. అనేక చేపల వంటకాలు పెరుగుతూనే తయారు చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఆహారం పాలు చేపలు కలిపి తినడం ఏమాత్రం మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: