
చిట్కా: కొన్ని నీళ్లు తీసుకొని వాటిని వేడి చేయండి. ఎప్పుడు వేడి అవుతున్న నీళ్లలో తురిమిన అల్లం వేసి బాగా మరిగించండి.(చిటికెడు పసుపు కూడా వేయొచ్చు) అలా మరిగాక దాన్ని వడపోసి ఆ వచ్చిన నీళ్ళని గోరువెచ్చగా తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఇలా రోజులో 2 - 3 సార్లు వరకు గోరువెచ్చని అల్లం నీళ్లు తాగితే గొంతులో ఉన్న గార గార ఈటె దూరమవుతుంది.
శాస్త్రీయ పరిశోధన ద్వారా మద్దతు ఇవ్వబడ్డ అల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇదిగో:
దీనిలో ఉన్న జింజిరోల్స్ లో శక్తివంతమైన ఓషధ లక్షణాలను కలిగి ఉంటాయి.
బరువు తగ్గడంలో అల్లం ఒక మంచి పాత్ర పోషిస్తుంది
ఆస్టియో ఆర్థరైటిస్‌కి(osteoarthritis ) సహాయపడుతుంది
రక్తంలో షుగర్ లెవల్స్ తీవ్రంగా తగ్గించవచ్చు
గుండె జబ్బుల ప్రమాద కారకాన్ని మెరుగుపరుస్తుంది
అల్లంలో శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి
దీర్ఘకాలిక అజీర్ణంతో బాధపడుతున్నవారికి చికిత్స చేయడానికి అల్లం చాలా సహాయపడుతుంది
అల్లం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆడవారికి నెలసరి వచ్చే కడుపు నొప్పి నుంచి వారికి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది/
మెదడు చురుకు చేస్తుంది
అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో అల్లం మంచిగా పని చేస్తుంది
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ మరియు ఇతర ఆరోగ్యకరమైన లక్షణాలు ఉండటం చేత ఆరోగ్యానికి ఎంతో మంచిది.
గమనిక: ఆరోగ్యానికి చాలా లాభకరం అని మరి అత్యధికంగా సేకరించి ఇబ్బందులు పడకండి.