మన శరీరంలో అధిక కొవ్వు నిల్వలు ఏర్పడతాయో అప్పుడు ఊబకాయం, అధిక బరువు పెరిగిపోవడం, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాదు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలకు కూడా దారి తీయవచ్చు. వైద్యులు చెబుతున్న సలహాలు తీసుకొని .. తినే ఆహారంపై కాస్త జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నచ్చింది కదా అని ఏది పడితే అది అది తినడం వల్ల చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఎప్పుడైతే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందో అప్పుడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడి ఫలితంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే సమస్యలు ఎక్కువ. మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు డెసి లీటర్ కు 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహారాల ద్వారా మనం కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు .. అని ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ ఒక మీడియా వేదికగా వెల్లడించింది.
మాంసం అధికంగా ఇష్టపడేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు కానీ మాంసం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. తినాలి అనుకునేవారు స్కిన్లెస్ చికెన్ , టర్కీ బ్రెస్ట్ , బీన్స్, చేపలు వంటి అధిక ప్రోటీనులు కలిగిన.. తక్కువ ఫ్యా్ కలిగిన ఆహారాల ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. చిరుతిళ్ళకు దూరంగా ఉండాలి .. ముఖ్యంగా కేకులు, పిజ్జాలు, బర్గర్లు , ప్రాసెస్ చేసిన మాంసాహారం వంటివి దూరం పెడితే తప్పకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి