ఇక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. అసలు మునుపెన్నడూ కూడా లేని విధంగా ఎండలు బాగా హడలెత్తిస్తున్నాయి. అసలు వేసవి కాలం పూర్తిస్థాయిలో రాకముందే ఎండలు అనేవి భగభగ మండిపోతున్నాయి.ఉదయం 11 గంటలు దాటిందంటే చాలు ఎండలు బాగా దంచికొడుతున్నాయి. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం బాగా జడుసుకుంటున్నారు. అలాగే మరోవైపు ఎండాకాలంలో వచ్చే శారీరక సమస్యలు కూడా ప్రజలను బాగా వేధిస్తున్నాయి. ఇటు ఎండలతో పాటు శారీరక సమస్యలతో కూడా జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో చర్మ సమస్యలు అనేవి అత్యంత ఎక్కువగా బాధిస్తాయి. చెమట, చెమటకాయలు, తామర, వేడి గడ్డలు ఇంకా అలాగే వడదెబ్బ వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇక ప్రాణాలను హరించే వడదెబ్బ అయితే ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా భయపెడుతుంది. అందుకే వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.



ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని ఆరోగ్య చిట్కాలను సూచిస్తున్నారు.వాటిని పాటించడం ద్వారా ఖచ్చితంగా వేసవి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్యకరమైన చిట్కాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...ఈ ఎండాకాలంలో ఆభరణాలు ధరించడం వల్ల చర్మ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వాటికి కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది. తరచుగా నీటిని తాగుతూ ఉండాలి.ఇంకా అలాగే ద్రవ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.శర్బత్, నిమ్మరసం ఇంకా అలాగే మజ్జిగను ఎక్కువగా తాగాలి.మీరు ఎండలో బయటకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా గొడుగును వెంట తీసుకెళ్లండి.ఇక ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు సన్‌స్క్రీన్ లోషన్స్ ని వాడాలి.అలాగే కాటన్ దుస్తులు, తెలుపు రంగు దుస్తులు వాడటం వల్ల ఎండ వేడిమి నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు.ఇక నలుపు రంగు దుస్తులను అయితే మీరు అస్సలు ధరించొద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: