ఇటీవలి కాలంలో చుండ్రు జుట్టు రాలడం లాంటి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. దేవుడా ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా అంటూ ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎన్ని రకాల చిట్కాలు పాటించిన కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమయంలోనే తరచూ తలస్నానం చేయడం వల్ల కూడా ఇలా చుండ్రు జుట్టు రాలే సమస్యలు వచ్చాయి ఏమో అని ఎంతో మంది అనుమాన  పడుతూ ఉంటారు. వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలి.


 ఎన్నిసార్లు తలస్నానం చేయడం వల్ల అటు వెంట్రుకలు బలంగా ఉండడంతో పాటు చుండ్రు  సమస్యకు కూడా చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయంలో కూడా ఎప్పుడూ అయోమయ పడుతూ ఉంటారు జనాలు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తలస్నానం చేయడం విషయంలో సమాధానాలు చెబుతూ ఉంటారు. కానీ ఎవరికి కూడా వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేస్తే బెటర్ అన్న  విషయంపై సరైన అవగాహన ఉండదు.


 ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల నష్టమే ఎక్కువ అని అంటున్నారు నిపుణులు. సాధారణంగా వారం లో రెండు సార్లు తలస్నానం చేస్తే ఎంతో మంచిది అని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రోజూ చుండ్రు డెడ్ స్కిన్ సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు. ఒకవేళ డాండ్రఫ్ సమస్య ఎక్కువగా ఉంటే రోజు తప్పించి రోజు తలస్నానం చేయడం మంచిది అని అంటున్నారు. ఇక జుట్టు పెరగడానికి నూనె కు ఎలాంటి సంబంధం ఉండదు అని చెబుతున్నారు. నూనె కేవలం జుట్టుకి కండిషనర్గా మాత్రమే ఉపయోగపడుతుందట. తలస్నానానికి ముందు నూనె రాసుకుంటే షాంపూలో ఉండే హానికరమైన పదార్థాల నుంచి నూనె జుట్టును రక్షిస్తుంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: