ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పట్లో ఆరోగ్యం అనేది మరింత క్లిష్టంగా మారింది. ఎవరిని కదిలించినా ఎదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. నిత్యం రోగులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి అంటే అనారోగ్యం అనేది ఎంతగా పెరిగిపోయింది అన్నది అర్దం అవుతోంది. ఇక ఇప్పటి కాలం లో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా చాలా ఎక్కువైపోయారు. ముఖ్యంగా అధిక బరువు, కొలస్ట్రాల్ సమస్యలతో సతమతమవుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ శాతం పెరగడం వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు కొలెస్ట్రాల్‌ అనేది ఎంత ప్రమాదకరం అంటే కొలస్ట్రాల్ ఎక్కువై గుండె సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య నాటికి నాటికి పెరుగుతోంది.

కొలెస్ట్రాల్‌ లో రెండు రకాలు ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. అవి ఒకటి HDL కొలెస్ట్రాల్‌ మరొకటి LDL కొలెస్ట్రాల్‌ .. దీనిలో LDL కొలెస్ట్రాల్‌ వల్ల ప్రమాదం అనేది ఎక్కువ.  దీనివల్ల గుండె రక్తనాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణ నిలిచిపోతుంది తద్వారా ప్రాణాపాయం ఉండే అవకాశం ఎక్కువ. అందుకనే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే పదార్ధాల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ ఏర్పాటు అవుతుంది. ముఖ్యంగా పాలు అలాగే పాల పదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్లులోని పచ్చసొన వంటి వాటి కారణంగా శరీరం లోకి కొలెస్ట్రాల్‌ చేరుతుంది. అందుకే వాటిని వీలయినంత తక్కువ మోతాదులో తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

వెల్లుల్లి కొలస్ట్రాల్ తగ్గించడం లో అద్భుతంగా పనిచేస్తుందట.  ప్రతి రోజూ సగం వెల్లుల్లిని తినడం వలన .. కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అలాగే  ధనియాలు, కొత్తిమీరలలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా సహకరిస్తాయట.
టొమాటోలు,  కాలీఫ్లవర్, క్యాప్సికమ్‌, క్యారెట్లు, ఆకు కూరలు, ఉల్లిపాయలు వంటివి కూడా కొలెస్ట్రాల్ నియంత్రించడం లో బాగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ధనియాలను కనుక రోజు కొద్దిగా నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయొచ్చని అంటున్నారు. ఇది కంటిన్యూగా చేయాలి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: