మన పూర్వీకుల నుంచి పలు రకాల ఆచారాలు చాలామంది ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉంటారు.. అలాంటి వాటిలో కుటుంబం అందరూ కలిసి నేల మీద కూర్చొని భోజనం చేసే ఒక పద్ధతి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబంతో కలిసి భోజనం చేయటం అరుదుగా ఉంటుంది.. నేల మీద కూర్చొని తినడం కూడా చాలా తగ్గిపోయింది. అయితే నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


మనం నేల మీద కూర్చుని తినడం వల్ల చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కండరాళ్లు నొప్పి ఏదైనా సరే వెంటనే తగ్గిపోతుందట. పొట్టపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.


నేల మీద కూర్చొని తినడం వల్ల మంచి శరీరాకృతి కనిపించడమే కాకుండా వివిధ రకాల శారీరక నొప్పులను కూడా తగ్గిస్తుందట. అందుచేతనే మన పూర్వీకులు సైతం ఎన్నో ఏళ్లు జీవిస్తూ ఉన్నారు.


నేల మీద కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ చాలా సాఫీగా జరుగుతుంది. నేలమీద కూర్చొని తింటున్నప్పుడు వంగడం ,నమిలి మింగడం చేస్తూ ఉంటాము కనుక ఇందులో అవసరమైన ఆమ్లాలు శరీరంలోకి చాలా ఉత్పత్తి అవుతాయి. జీర్ణం బాగా కావడం చేత శరీరానికి కావాల్సినంత శక్తి కూడా అందుతుంది.


నేల మీద కూర్చొని భోన్ చేయడం వల్ల అధిక బరువుతో ఇబ్బంది పడేవారు బరువు తగ్గవచ్చు.


అయితే నేల మీద కాకుండా ఇతర చోట కూర్చొని తింటున్నట్లు అయితే ఫలితంగా ఎక్కువ తినడమే కాకుండా బరువు పెరిగేందుకు ఆస్కారం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

నేలపై కూర్చొని తినేవాళ్లు కాళ్లు అడ్డంగా మడుచుకొని తింటున్నట్లు అయితే కండరాలు బలంగా మారడమే కాకుండా శరీరం చురుకుగా ఉంటుందట.దీంతో ఎముకలు కూడా బలహీనత లేకుండా ఉంటాయట.

ఇలా ఇష్టమైన ఆహారాన్ని నేల మీద కూర్చొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: