చాలామందికి చాలాచోట్ల పులిపిర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఇవి అసహ్యంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా యుక్త వయసులో ఉండే వారిలోనే కనిపిస్తాయట.మగవారిలో కంటే మహిళల్లో మరింత ఎక్కువగా కనిపిస్తాయట. ఇవి రావడానికి ముఖ్యం కారణ హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ కారణమట. ఈ పులిపిర్లు చూడడానికి చర్మం రంగులో కలిసిపోయి ఉన్నప్పటికీ కాస్త లావుగా గోధుమ రంగు గింజలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి నొప్పిని మాత్రం కలిగించవని ఒకవేళ వాటి దగ్గర ఒత్తిడి చేస్తే మాత్రం అసౌకర్యంగా అనిపిస్తుందట.ఈ పులిపిర్లు ఎక్కువగా ముఖం పైన మెడ పైన చేతులపైన మాత్రమే వస్తూ ఉంటాయి. అయితే వీటిని తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే సరిపోతుందట.


1). వంటింట్లో దొరికేటువంటి వెల్లుల్లి ఎన్నో వాటికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండేటువంటి ఎల్లిసీన్ అనే పదార్థం ఫంగస్ వంటి వైరస్ బ్యాక్టీరియాలతో కూడా ఎక్కువగా పోరాడుతుంది.. పులిపిర్లను సైతం తొలగించడానికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లి పేస్టును పులిపిర్లు ఉన్నచోట రాస్తే కేవలం రెండు రోజులలోనే ఊడిపోతాయట.

2). కాస్త బేకింగ్ పౌడర్, కొంచెం టూత్ పేస్ట్, కాస్త ఆముదం వేసి బాగా కలిపిన తర్వాత పులిపిర్ల మీద ఈ పేస్ట్ రాసి.. గాలి ఆడకుండా పులిపిర్లు ఉన్నచోట ప్లాస్టర్ వేసి.. అలా మూడు రోజులు చేస్తే  కచ్చితంగా పులిపిర్లు రాలిపోతాయట..


3). నెయిల్ పాలిష్ వల్ల కూడా పులిపిర్లు రాలిపోతాయి.. ఇది ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. పులిపిర్లు ఉండే చోట ఈ నైల్ పాలిష్ ను రాస్తే ఐదు రోజులలోనే ఇవి రాలిపోతాయి.


4). తాజా కలబంద గుజ్జును తీసుకొని ప్రతిరోజు పులిపిర్లపైన అప్లై చేస్తే అలా కొద్ది రోజులకి పులిపిర్లు సైతం రాలిపోతాయట.


ఇలాంటివి చేసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే పులిపిర్లను సైతం మటుమాయం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: