
నిన్న మొన్నటి వరకు అంత ప్రశాంతంగా ఉంది ..ప్రాబ్లం ఏం లేదులే అనుకునే మూమెంట్లోనే కరోనా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది . ఒకటి కాదు రెండు కాదు కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువగా పెరిగిపోతున్నాయి . మరి ముఖ్యంగా రెండు మూడు రోజులుగా అంతర్జాతీయ మీడియా లో కూడా కరోనా గురించి ఎలాంటి వార్తలు వింటున్నామో చూస్తున్నాము. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న మూమెంట్లో గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచిస్తుంది . కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలలోనూ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి . అయితే ఇక్కడ జనాలకు అర్థం కానిది ఏంటంటే.. కరోనా సంవత్సరానికి ఒకసారి ఎలా వచ్చి పోతుంది..? అసలు కరోనా కేసులు ఇండియాలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి ..? ఇన్ని కేసులు ఎలా వెలుగులోకి వచ్చాయి..?
కొత్త కొత్త వేరియంట్ల పేరుతో కరోనా మళ్ళీ వచ్చింది అంటూ ప్రచారం చేస్తున్నారు . అసలు దీని వెనక ఏమన్నా భారీ స్కెచ్ ఉండా..? అన్న కోణంలో మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే కొత్త కొత్త వేరియంట్ ల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి కొందరు మెడికల్ మాఫియా టీం ప్రయత్నిస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. కరోనా అంటే సాధారణ జలుబు దగ్గు అనుకునే జనాలు ఎంతోమంది ఉన్నారు. అయితే వాటికి ఉపయోగించే మందులతో ఇది తగ్గిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం అని డాక్టర్లు కూడా చెప్పికొస్తున్నారు. కరోనా వస్తే ఏదో జరిగిపోతుందన్న భయం నుంచి ఇప్పుడు ఇప్పుడే ప్రపంచం బయటపడుతుంది . అయితే కొన్ని మెడికల్ మాఫియా మాత్రం కరోనా వస్తే ఖతం అనే రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు .
సంవత్సరానికి ఒకసారి కరోనా మళ్ళీ వచ్చింది అంటూ ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతూ మెడికల్ మాఫియా విచ్చలవిడిగా డబ్బులు కూడ పెట్టుకుంటుంది అని .. కరోనా పేరుతో ఇంజక్షన్లు .. వ్యాక్సిన్లు.. మాస్కులు.. శానిటైజర్లు ఎక్కువగా అమ్ముడుపోయేలా చేసుకుంటుంది అని కరోనా వచ్చినా రాకపోయినా కరోనా వచ్చింది అంటూ ప్రచారం చేసి కొందరు మెడికల్ మాఫియా టీం విచ్చలవిడిగా డబ్బులు గుంజేస్తుంది అంటూ కామన్ పీపుల్స్ మండిపడుతున్నారు. కరోనా అనే ప్రచారాన్ని మొదట చేసింది చైనా .. ఆ తర్వాత ప్రపంచ దేశాలు దానికి అలవాటు పడిపోయాయి. కరోనా పేరుతో ప్రజలని భయపెట్టే జనాలు కొందరైతే కరోనా రాకపోయినా వచ్చింది అంటూ వేలకు వేలు డబ్బులు గుంజుతూ మాస్కులు దగ్గర నుంచి వ్యాక్సిన్ ల వరకు పూర్తిగా మాఫియాగా మార్చేసింది మెడికల్ టీం.
నార్మల్ జలుబు వచ్చినా సరే కరోనా వచ్చింది ఏమో అంటూ 10 రకాల టెస్ట్ లు చేయించి డబ్బులు గుంజే డాక్టర్లు మరికొందరు. ప్రజలను దోపిడీ చేయడానికి ఇది ఒక రూట్ గా మార్చేసుకుంది మెడికల్ టీం ..అంటూ జనాలు మండిపడుతున్నారు. అయితే కరోనాని.. అంత తక్కువ అంచనా వేయక్కర్లేదని జాగ్రత్తలు పాటించకపోయినా కొంచెం నిర్లక్ష్యం చేసిన కరోనా మళ్ళి తిరగబడి ప్రపంచాన్ని అతలాకుతనం చేస్తుంది అంటూ డబ్ల్యూహెచ్వో వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. అసలు కరోనా సంవత్సరానికి ఒక్క సారి ఎక్కడ నుండి వస్తుంది..? కేసులు ఎక్కడినుంచి వస్తున్నాయి..? తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా రాకుండా అడ్డుకట్ట వేయలేకపోతున్నాం ఎందుకు..? అనే విధంగా కూడా కామన్ పీపుల్స్ మాట్లాడుకుంటున్నారు . కొంతమంది మాత్రం మాకు కరోనా రాకపోతే చాలు అంటూ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు..!