అవును ..సరిగ్గా మరో 30 - 40 ఏళ్లలో చాక్లెట్స్ దొరకడం అనేది పెద్ద గగనంలా మారిపోతుంది.  ఒక్కటంటే ఒక్క చాక్లెట్ కూడా కనిపించకపోవచ్చు . ఈ విషయాన్ని స్వయాన సైంటిస్టులే బయటపెడుతున్నారు.  దానికి కారణం కూడా వివరిస్తున్నారు . చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..? ఎవరైనా సరే చాక్లెట్ ని ఇష్టపడతారు.  చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్ళు కూడా చాక్లెట్లు బాగానే తింటూ వస్తారు. డార్క్ చాక్లెట్స్ అని స్టైలిష్ చాక్లెట్స్ అని రకరకాల పేర్లతో అంగడిలో బాగానే చాక్లెట్లు దొరుకుతూ వస్తాయి.  మరి ముఖ్యంగా చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తామంటే ఏ పనైనా చేస్తారు .


అయితే అంత పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ మరో 40 ఏళ్లలో కనుమరుగు కాబోతున్నాయి . అవును మీరు వింటున్నది చదువుతున్నది నిజమే . మనకు తెలుసు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారు అనేది.  కోకోవా ప్లాంట్ ద్వారా అని ..కోకోవా విత్తనాల నుంచి కోకోవాలను తీసి చాక్లెట్లు తయారు చేస్తారు . అయితే ఈ కోకోవా మొక్కలు ఎక్కువగా ఆఫ్రికన్ దేశాలలోనే పెరుగుతూ వస్తాయి . ఇది పెరగాలంటే వాతావరణం పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి . మరీ ముఖ్యంగా ఉష్ణోగ్రత ..తేమ ఇతర అంశాలు 365 రోజులు స్థిరంగా ఉండాలి.

 

అప్పుడు ఈ కోకోవా మొక్కలు బాగా పెరుగుతాయి . అయితే నేటి తరుణంలో సంభవిస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల కోకోవా పండే ప్రాంతాలలో వాతావరణం బాగా హీట్ ఎక్కిపోతుంది. దీంతో కోకోవా పంట త్వరలోనే అంతరించిపోయే అవకాశం ఉంది అంటున్నారు సైంటిస్టులు . ఇలా జరిగితే మాత్రం మరో నలభై ఏళ్ల తర్వాత కోకోవా మొక్కల జాతి పూర్తిగా అంతరించిపోతుంది.  తద్వారా చాక్లెట్లు అనేటివి అస్సలు కనిపించవు అంటే దాదాపు 2060వ సంవత్సరంలో కోకోవ మొక్కలు పూర్తిగా అంతరించిపోతాయి.  అప్పుడు మనకు చాక్లెట్ అడిగిన దొరకదు . కనుక మీరు చాక్లెట్ లవర్స్ అయితే ఇప్పటి నుంచి అవి తినడం మానుకోండి అంటూ కొంతమంది జనాభా నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది సైంటిస్టులు మాత్రం చాక్లెట్లను కృత్తిమంగా తయారు చేసేందుకు ఇప్పుడిప్పుడే పరిశోధకులు కొత్త రకాల పరిశోధనలు ప్రారంభించారు అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది..???

మరింత సమాచారం తెలుసుకోండి: