గడచిన నాలుగు సంవత్సరాల క్రితం చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాలను వణికించేలా చేసింది. దీనివల్ల మానవ మనుగడ కూడా ప్రమాదంలో పడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే వీటి నుంచి ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తిరిగి మళ్లీ కరోనా వైరస్ పురుడు పోసుకుంటోంది. అయితే ఇలాంటి సమయంలోనే ఇప్పుడు చైనా ల్యాబ్ నుంచి మరొక డేంజరస్ ఫంగస్ కూడా బయటికి వచ్చినట్లు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించిన విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.


పూసరియమ్ గ్రామినేరియమ్  అనే ఫంగస్ చైనా నుంచి అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది.. అయితే ఈ ప్రమాదమైన ఫంగస్ అక్రమంగా అమెరికాకు రవాణా చేస్తున్న సమయంలో ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ కావడంతో ఈ విషయం బయటపడింది. మిషిగం యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్న సమయంలో ఈ ఫంగస్ తరలిస్తున్నట్లుగా ఎయిర్ పోర్ట్ లో అధికారులు శాస్త్రవేత్తలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చైనా అమెరికా మధ్య జరుగుతున్న కొన్ని విభేదాల కారణంగా అమెరికాను ఎలాగైనా తొక్కేయాలని కుట్రతోనే చైనా ఇలాంటి పనులు చేస్తోంది అన్నట్లుగా అనుమానాలను తెలియజేస్తోంది.


అయితే వీటి పైన బయోలాజికల్ వార్ అన్నట్టుగా అమెరికా ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ ఫంగస్ వల్ల అటు పశువులు, మానవులకు చాలా హాని కలుగుతుందని వీటివల్ల వాంతులు , వీరేచనాలు వంటివి అవ్వడమే కాకుండా కాలయాన్ని కూడా దెబ్బతీసేలా చేస్తుందంటూ అమెరికా వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ ఫంగస్ లో ఉండేటువంటి శిలీంద్రాలు కూడా మొక్కజొన్న వరి గోధుమ బార్లీ వంటి పంటలను కూడా నాశనం చేసేలా చేస్తాయంటూ అధికారులు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికాను ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలని చైనా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అమెరికా ప్రభుత్వం కూడా అన్ని విషయాల పైన ప్రత్యేకించి మరీ దృష్టి పెట్టి చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: