
బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరలలో లుటీన్ మరియు జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇవి కంటిలోని రెటీనాను కాపాడటంతో పాటు వయస్సు సంబంధిత మచ్చల క్షీణతను నివారిస్తాయని చెప్పవచ్చు. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇవి కంటి పొడిబారడం మరియు ఇతర సమస్యలకు చెక్ పెడతాయి.
నారింజ, క్యారెట్లు, బెర్రీలు వంటి వాటిలో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో పాటు ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ మరియు జింక్ ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదం, వాల్ నట్స్ వంటి గింజలలో విటమిన్ ఇ మరియు ఇతర పోషకాలు ఉండటం వాళ్ళ కళ్ళకు మేలు జరుగుతుంది.
వీటితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు క్రమమైన కంటి పరీక్షలు కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైనవి చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు కంటి అద్దాలను వాడటం ద్వారా కంటి సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు