ఫిబ్రవరి 19వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది జననాలు ఇంకెంతో మంది మరణాలు జరిగాయి. కాగా  ఓక్కసారి నేడు చరిత్రలోకి వెళితే ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 నికోలస్ కోపర్నికస్ జనం : శాస్త్రీయంగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నిరూపించిన సిద్ధాంతకర్త మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అయిన నికోలాస్ కోపర్నికస్ 1473 ఫిబ్రవరి 19వ తేదీన జన్మించారు. గ్రహాల కదలికల ఆధారంగా గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించిన వ్యక్తి నికోలస్ కోపర్నికస్. భూమి తన కక్ష పైన తిరుగుతుందని అందుకే రాత్రి పగలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. భూ ఆక్రమణ పరిభ్రమణం వల్ల శీతోష్ణస్థితులు ఋతువులు మారుతున్నాయి అంటూ ఈయన కున్నారు. జ్యోతిష్య గ్రంధాలను ప్రజలు ఎక్కువగా నమ్ముతున్న కాలంలో కోపర్నికస్ వాస్తవాలను ఈ నిజాలను బయట పెట్టేందుకు ధైర్యం చేయలేదు. కాగా  ఎట్టకేలకు నిజాలను బయటపెట్టిన నికోలాస్ కోపర్నికస్ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. 

 

 చత్రపతి శివాజీ జననం : పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన గొప్ప వ్యక్తి చత్రపతి శివాజీ. ఈయన  1627 ఫిబ్రవరి 19వ తేదీన జన్మించారు. పదిహేడేళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యాన్ని  సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్లలో పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఎన్నో యుద్ధాలు చేసిన శివాజీ మహారాజ్ ఎంతోమందిని ఓడించి విజయం సాధించారు. యుద్ధతంత్రంలో  మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి. కాగా  చత్రపతి శివాజీ భవానీదేవి భక్తుడు. తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. 

 


 బల్వంతరాయ్ మెహతా జననం : గుజరాత్ రెండో ముఖ్యమంత్రి అయిన బల్వంతరాయ్ మెహతా 1900 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన జన్మించారు.ఈయన  రాచరిక రాష్ట్రాల రంగపు స్వయం పాలన కోసం ప్రజల పోరాటంలో ఇది అత్యుత్తమ సహకారం అందించారు. ఇతని పేరు స్పష్టంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ తో ముడిపడి ఉంటుంది. 

 

 ఆలపాటి లక్ష్మి జననం : ప్రముఖతెలుగు సినీ  నటి అయిన ఆలపాటి లక్ష్మి 1952 ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరు లో జన్మించారు. మూడవ యేటనే రంగస్థల ప్రవేశం చేసి వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఈమె ఎన్నో సినిమాలలో పలు పాత్రల్లో నటించి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో ధారావాహికలో కూడా నటించారు ఆలపాటి లక్ష్మి. ఉత్తమ నటిగా వందలాది బహుమతులను సైతం గెలుచుకున్నారు ఆలపాటి లక్ష్మి.

 

 గోపాలకృష్ణ గోకులే మరణం : భారత స్వతంత్ర సమరయోధులు అయిన గోపాలకృష్ణ గోకులే 1915 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు గోపాలకృష్ణ గోకులే. ఈయన  గొప్ప సామాజిక సేవకుడిగా కూడా ప్రసిద్ధికెక్కారు. 


 గుండు హనుమంతరావు మరణం : ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు గుండు హనుమంతరావు 2018 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. ఎన్నో సినిమాల్లో హాస్య నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో ధారావాహికలు కార్యక్రమాలు కూడా చేశారు గుండు హనుమంతరావు. అమృతం అనే టీవీ సీరియల్ గుండు హనుమంతరావు కి మంచి పేరు తీసుకువచ్చింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాల ద్వారా నంది అవార్డులను సైతం అందుకున్నారు గుండు హనుమంతరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: