ప్రజలు చరిత్ర నిర్మాతలు. సమసమాజ నిర్ణేతలు" అనే  నినాదం అనాదిగా ప్రజల నోట్లో నానుతున్నది. ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకు కాలానుగుణంగా అటు నాగరికత లోనూ ఇటు సంస్కృతి సంప్రదాయాలలోను వినూత్నమైన అపరిమితమైన మార్పులు సంభవించినవి. సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక అవసరాలు, మనిషి ఆలోచనా సరళిలో వచ్చిన మార్పులు ఈ పరిణామానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

    భారతదేశంలో నైతే ప్రధానంగా చేసే వృత్తులను బట్టి కుల వ్యవస్థ ఏర్పడినట్లు గా తెలుస్తున్నది. ఇదే అదనుగా భావించిన టువంటి ఆర్య సంస్కృతి అస్పృశ్యత, వివక్షత కుల వ్యవస్థలో ప్రధానంగా జోడించడం వలన ఇప్పటికీ కులపరమైన వైషమ్యాలకు, అకృత్యాలు ,అరాచకాలకు ఈ దేశం వేదిక అయినది. దుర్మార్గపు చరిత్రకు అడ్డుకట్టవేసి అరాచక వాదులను అంతం చేయడానికి జరిగిన పోరాటం కూడా ప్రజల చరిత్ర గా పోరాట చరిత్ర గా మిగిలిపోయింది.  రాజులు రాచరిక విధానాల ప్రాతిపదికగా ప్రజలను పాలించిన క్రమంలో ప్రజలకు చేసిన మేలు కంటే అక్కడక్కడ చేసిన కీడు కూడా ఎక్కువే. ముఖ్యంగా పండితులు కవులు కళాకారులను హింశించిన రాజవంశాలు కూడా లేకపోలేదు. కవిసార్వభౌముడు శ్రీనాథుని వడ్డె రాజుల కాలంలో ప్రతిభ పాటవాలను గౌరవించకుండా ప్రాంతం నుంచి బహిష్కరించిన కుటిల రాజనీతిని మనం చరిత్రలో చూడవచ్చు. కానీ ప్రకృతి నుండి నేర్చుకున్న టువంటి జ్ఞాన సంపద, ఆలోచనా ధోరణి, అన్వేషణ మనిషి జీవితానికి ఎనలేని ప్రోత్సాహాన్ని అందించిన కారణంగా నైపుణ్యం ఆధారంగా వివిధ కుల వృత్తులు, చేతి వృత్తులతో పాటు ఉత్పత్తి  ప్రక్రియలో ప్రధాన భాగస్వాములు కాగలిగి
 నారు.
     వివిధ నైపుణ్యములు కలిగిన వృత్తుల్లో పని చేసిన ప్రజలు తమ కళాతృష్ణను వృత్తి నైపుణ్యాన్ని సమాజానికి అవసరమున్న చోట అందిస్తూనే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము ద్వారా తమకంటూ ఓ చరిత్ర నిర్మాణం చేసుకున్నారు. గృహ నిర్మాణము, చిత్రలేఖనము, శిల్పము, వాహన నిర్మాణము, వ్యవసాయ పనిముట్లతయారీ, వస్త్రాల తయారీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.


     సామాన్య ప్రజలలో అసామాన్యమైన ప్రతిభ ఉన్న అనేకమంది ప్రజలు ముఖ్యంగా వ్యవస్థ పట్ల మర్యాదతో వ్యవహరించడమే కాకుండా మిగతా సమాజానికి సేవలు చేసి తమ నిజాయితీని చాటుకున్నారు. కానీ ఏనాడు కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి  అర్రులు చాచ లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ప్రక్రియలో ప్రధాన భాగస్వాములు అయినటువంటి అట్టడుగు వర్గాలు ముఖ్యంగా ఆర్య పరిభాషలో శూద్రులు అనబడే వర్గాన్ని మిగతా మూడు వర్గాలు చిన్నచూపుతో అవమానించిన ప్పటికీ ఇప్పటికీ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వాములు వారేనన్న చేదు నిజాన్ని సమాజం ఆలోచించాలి .అంగీకరించాలి

మరింత సమాచారం తెలుసుకోండి: