ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం కొనసాగిస్తున్నాము. నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహరం సరిగా తినక పోవడం, నిలకడ లేని ఆలోచనలతో పిల్లలు యంత్రాలవలె పరిగెడుతూ చదువు భారం ఎక్కువై తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి వలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తల నొప్పి. తలా నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నవారిలో అధికంగా స్కూలు పిల్లలే. దీనికి కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు చదువుల్లో పొటీ తత్వం పెరిగి పోవడం. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కోని చదవడం. నిద్ర సరిగా లేక పోవడం వలన తలనొప్పి రావడం సహజం. తలనొప్పి వలన ఏ పని సరిగా చేయలేక లోలోపల మదన పడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు పిల్లలు.
పిల్లలకు తలనొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. అధిక మానసిక ఒత్తిడి వలన మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది. పిల్లలకు తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండును. శబ్దాలు భరించలేక పోవటం.పిల్లలు వెలుతురును సరిగా చూడలేక పొవుట, కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపించుట. ఆహరం సరిగా తీసుకోక పోవటం వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు. మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి పిల్లలకు నేర్పించి నిత్యం చేపిస్తే మానసిక ప్రశాంతత కలిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలను చదవమని దబాయించకూడదు.
పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. పిల్లలకు నిత్యం ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు పెట్టకుండా పౌష్టిక ఆహారం ఇవ్వాలి. ఆకుకూరలకు, కూరగాయలు, తాజా పండ్లు పిల్లలకు ఇవ్వటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు నీరు అధికంగా తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ ఉండాలి. ప్రతి రోజూ వేకుమజామున లేచి 45 నిమిషాల పాటు నడవటం లేదా ఏదైనా వ్యాయామం చేసు కోవటం అలవాటు చేసుకోవాలి. తద్వార రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తల నొప్పి తీవ్రత తగ్గును. తలనొప్పే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలకు దారి తీయును.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి