మనం ప్రతిరోజూ తినే ఆహారంలో వేరు వేరు రకాల ఆకుకూరలను తింటూ ఉంటాం. ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర, గోంగూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు మొదలైనవి ప్రధానంగా ఆహారం లో చేర్చుకుంటూ వుంటాము.వీటిని అధికంగా ఆహారంలో తీసుకోవడం వల్ల,శ‌రీరానికి అవసరమైన విటమిన్ ఏ,డీ,కే,సి , మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, క్యాల్షియం, సోడియం, ఇత‌ర పోషకాలు పుష్కళంగా లభిస్తాయి. వీటిని రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పాంటోథెనిక్ ఆమ్లం పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మార్చి,శరీరానికి తక్షణ శక్తినిచ్చే మూలకంగా  పనిచేస్తాయి.ఆకుకూరల్లో అధిక యాంటీ ఆక్సిడెంట్‌లు లభిస్తాయి.ఇందులో యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు పుష్కళంగా ఉండడం వల్ల క్యాన్స‌ర్ రాకుండా ప్రీ ర్యాడికల్స్ తో పోరాడుతాయి. ఇది చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి.ఆకుకూరల్లో ఉండే అధిక ఫైబర్ అధిక బరువుతో బాధపడేవారికి,బరువును త‌గ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మ‌ల‌బ‌ద్ద‌కంను నివారిస్తుంది.


ఆకుకూరలు లభించే ఫ్లేవనాయిడ్స్,విట‌మిన్ కె అధికంగా ఉండటం వల్ల,మెద‌డు చురుగ్గా మారీ జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి.
ఆకుకూరలలో పొటాషియం అధికంగా ఉంటుంది. కావున హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే బ్లడ్ ప్రెసర్ కంట్రోల్ లో ఉంటుంది.

ఆకుకూరల్లో ఐరన్,కాల్షియం,  పాల‌కూర‌ మరియు గోగాకులో అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఎముక‌ల్లో క్యాల్సియం పెరిగి ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా అవుతాయి. వయసుతో పాటు వచ్చే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.అలాగే ఆకు కూరలు విట‌మిన్ ఎ కి జన్మస్థానం వంటివి. వీటిని అధికంగా ఆహారంలో తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు ప‌రిచి.. రే చీకటి, కలర్ బ్లైండ్ నెస్, వయసు మీద పడటం వల్ల కలిగే కంటి సమస్యలు వంటి వాటిని నివారిస్తాయి. మునగాకును రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మధుమేహ రోగులకు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను అదుపులో ఉంచి షుగర్ ని తగ్గిస్తుంది. మెంతి కూర తో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తొలగి, అందంగా పెరిగి మెరుపును సంతరించుకుంటుంది.కావున ప్రతి రోజు ఆకుకూరలు ఆహారంగా తీసుకోవడం వల్ల  మన ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకవిలువలు పుష్కళంగా, తక్కువ ఖర్చులో అధిక లాభం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: