
శరీరంపై వచ్చే దద్దుర్లు..
సాధారణంగా అలర్జీల వల్ల చాలామందికి చిన్నచిన్న దద్దుర్లు రావడం,నవ్వగా అనిపించడం, చీము కారడం వంటివి జరుగుతుంటాయి.అలాంటివారికి రోజూ వేడినీళ్లతో పసుపు కలిపి,రోజు దానిని సబ్బులా వాడితే, ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అలర్జీ సమస్యలను తగ్గిస్తాయి.
దగ్గు,జలుబు..
చలికాలంలో సీజనల్ మార్పుల వల్ల దగ్గు జలుబు సర్వసాధారణం.దీనికోసం ఎన్ని మందులు వాడినా ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు. అలాంటివారు రోజు పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్లల్లో అరస్పూన్ పసుపు వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా చేసుకుని త్రాగడంవల్ల, దగ్గు,జలుబుకు కారణమైన వైరస్ ను చంపివేస్తుంది. అంతేకాక గొంతులో పేరుకుపోయిన కఫంను తొలగస్తుంది.
మధుమేహం తగ్గించడానికి..
మధుమేహంతో బాధపడేవారు పచ్చిపసుపు దుప్పలను తీసుకొని, బాగా శుభ్రం చేసి, ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి.అందులో ఒక గ్లాస్ వేడినీటిని కలిపి మిక్సీ పట్టి,జ్యూస్ లా తయారు చేసుకోవాలి. దీనికి ఒక స్ఫూన్ తేనే, ఒక స్ఫూన్ నిమ్మరసం కలిపి రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి, మధుమేహం అదుపులోకి వస్తుంది.
అస్తమా తగ్గించుకోవడానికి..
చలికాలంలో అస్తమాతో బాధపడేవారు ముక్కుతో ఊపిరి పీల్చుకోలేక తెగ ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు, ఒక గ్లాస్ వేడినీటిలో, ఒక స్ఫూన్ నిమ్మరసం, ఒక స్ఫూన్ ఉసిరిరసం, ఒక స్ఫూన్ తేనే వేసుకొని తరుచూ తీసుకోవడంతో, ఇందులోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు అలెర్జీ తగ్గించి, అస్తమా అదుపులోకి తెస్తాయి.