రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల కాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఇంటర్ పరీక్షలు మొదలుకానుండగా మార్చి నెల చివరి వారంలో పదవ తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించాలంటే ఉన్న సమయాన్ని సబ్జెక్టుల వారీగా విభజించుకోవాలి. కాలాన్ని మూడు భాగాలుగా విభజించుకొని ప్రిపరేషన్ ను మొదలుపెట్టాలి. సబ్జెక్టులకు అనుగుణంగా కాలాన్ని స్వల్ప కాలికం, మధ్య కాలికం, దీర్ఘ కాలికంగా విభజించుకోవాలి. 
 
పరీక్షలలో మంచి మార్కులు సాధించటం కొరకు సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. చదువునే దైవంగా బాధ్యతను భక్తిగా మార్చుకొని కష్టపడాలి. ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను తెలివిగా పరిష్కరించుకొని విజయం దిశగా అడుగులు వేయాలి. పట్టుదలతో కూడిన ప్రయత్నం చేస్తే పరీక్షలలో సులభంగా విజయం సొంతమవుతుంది. చదివే సమయంలో నాన్ స్టాప్ గా చదవటం కంటే గంటగంటకూ బ్రేక్ తీసుకోవడం మంచిది. 
 
సిలబస్ ను వేగంగా చదవటం కంటే చిన్న చిన్న టిప్స్ రాసుకొని చదవడం ఉత్తమం. పరీక్షల సమయంలో అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుని ప్రశ్నాపత్రం ఇచ్చిన తరువాత ప్రశాంతంగా ప్రశ్నాపత్రాన్ని చదవాలి. జావాబుపత్రంపై కొట్టివేతలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్ష పూర్తయిన తరువాత జవాబుల గురించి ఫ్రెండ్స్ తో చర్చలు జరపకపోవటమే మంచిది. రాసిన జవాబుల విషయంలో సందేహాలు ఉంటే సబ్జెక్ట్ టీచర్ ను కలిసి సందేహాలను తీర్చుకోవడం ఉత్తమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: