ప్రస్తుతం అందరి నోట్లో నానుతున్న మాట బర్డ్ ప్లూ.. దేశ వ్యాప్తంగా కోళ్లు ఎక్కడిక్కడ మృత్యువు వాత పడుతున్న నేపథ్యంలో చికెన్ ను తినడానికి చాలా మంది ఇష్టపడటం లేదు.. ఇలాంటి సమయంలో చికెన్ తినొచ్చా.. చికెన్ తింటే ఏమైనా సమస్యలు వస్తాయా అంటూ ఆరా తీస్తున్నారు. అయితే గుడ్లు, చికెన్‌, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను సరిగ్గా ఉడికించి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ,ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.



ఎంత వైద్యాధికారులు చెప్పినా కూడా చాలా మంది తినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మైక్రో ఓవెన్ లో వండిన చికెన్ తినోచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మైక్రో ఓవెన్‌లో వండిన చికెన్, గుడ్లు తినక పోవడమే మంచిందని అంటున్నారు. మైక్రో ఓవెన్‌లో మాంసం సరిగా ఉడకకపోవడమే కారణమని వారు అంటున్నారు. గ్యాస్ స్టవ్‌ మీద సరిగా ఉడికించిన చికెన్‌ను మాత్రమే తినాలని సూచిస్తున్నారు. మామూలు రోజుల్లో చేసుకొనే దాని కన్నా కూడా ఎక్కువ ఉష్ణోగ్రత మీద పెట్టీ దాదాపు 30 నిమిషాల పాటు ఉడికించాలి.



గుడ్లు, చికెన్ సరిగా ఉడికి సురక్షితమైనవిగా మారతాయి. మంచి శుభ్రత పాటించి, సరైన విధంగా వండుకుని ఎప్పటిలాగే పౌల్ట్రీ ఉత్పతులును తినొచ్చు. బర్డ్‌ ఫ్లూ బయట పడ్డ ప్రాంతాల్లో కూడా చికెన్, గుడ్లను సరైన విధంగా ఉడికించి తీసుకుంటే ఎలాంటి వైరస్ సంక్రమించదు అని కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ తెలిపింది. మరో ముఖ్య విషయమేంటంటే.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులను ముట్టుకున్న వారు తమ చేతులను బాగా శుభ్ర పరుచుకోవాలని సూచించింది. అయినా చాలా మంది ఎక్కడ వాళ్లకు వస్తుందోనని చికెన్ ను ముట్టికోడం కూడా లేదు.. ప్రస్తుత పరిస్థితుల్లో దేనినైనా బాగా ఉడికించి తీసుకోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: