మానవుని సృష్టే ఒక అద్భుతం అని చెప్పాలి. అలంటి ఈ మానవుడు తాను సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎన్నో చిత్ర విచిత్రాలను, అద్భుతాలను కనుగొన్నాడు. ఇలా మానవుడు కనిపెట్టిన వాటిని అనుభవిస్తూ అంతా సుఖంగా ఉన్నాము. ప్రపంచంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ మరియు రిసార్ట్స్ ఇలా చాలా ఉంటాయి. ఎక్కడైనా ఆహారాన్ని మనము నెల మీద అమర్చిన టేబుల్స్ పైన కూర్చుని తింటాము. దాదాపుగా అన్ని ప్రదేశాలలో ఇదే విధమైన పద్దతిని మనము చూస్తూ ఉంటాము. అయితే ఒక దేశంలో మాత్రం సరికొత్తగా ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఆలోచించింది. ఇది మీరు తెలుసుకుంటే, ఇక ఆగలేరు అదే విధంగా చెయ్యాలని ఆరాటపడుతారు. మరి అదేమిటో ఒకసారి చూద్దాం. థాయిలాండ్ దేశంలోని కో కూడ అనే ద్వీపం ఉంది. ఆ ప్రదేశంలోని ఒక రెస్టారెంట్ పేరు ట్రీపాడ్. ఇక్కడ భోజనం తినాలంటే పైకి వెళ్లాల్సిందే. పైకి అంటే ఎక్కడికో కాదు, ఒక గుడ్డు ఆకారంలో నిర్మించిన ఒక గూడు. 
ఇందులో నలుగురు కూర్చుని తినడానికి అనుకూలంగా ఉంటుంది. చెట్లపై ఎలా అయితే కొన్ని పక్షులు గూడు పెట్టుకుని అందులో ఉంటాయో.  ఇందులోకి మనము వెళితే అదే ఫీలింగ్ కలుగుతుంది. ఒక పక్షిలాగా మనము అందులో హాయిగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆహారాన్ని తినవచ్చు.  అయితే ఇలాంటి గూడు లాగా ఉండే ప్రదేశాన్ని పాడ్ అని పిలుస్తారు. ఇక్కడకు చేరుకోవాలంటే బీచ్ పక్క నుండి ఒక చిన్న ప్రయాణం చేయాలట. వీటిని అక్కడే స్థానికంగా నివసించే వారు విరివిగా దొరికే వెదురు మరియు రట్టన్ ను ఉపయోగించి ఈ పాడ్ లను ఎంతో ఆకర్షణీయంగా తయారుచేస్తారట. అక్కడ ఉండే రెయిన్ ఫారెస్ట్ లో గాలిలో 36 అడుగులు ఎత్తులో వేలాడదీయబడి ఉంటాయి.  ఇవి అంత ఎత్తులో ఎంతో స్ట్రాంగ్ గా నిలబడడానికి కరెంటు కేబుల్స్ సహాయంతో చేస్తారని తెలుస్తోంది.  ఇంత ఎత్తు నుండి కింద ఉండే సుందర దృశ్యాలను చూస్తూ మైమరచిపోతారట అక్కడికి వచ్చే వారు. 
వీరికి ఆహారాన్ని తీసుకువచ్చే వెయిటర్ కూడా జిప్ లైన్ ల సహాయంతో ఎగురుతూ వస్తాడు. ఇది వేరొక లోకాన్ని తలపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ వీరికి ఇచ్చే ఫుడ్ ఏ విధంగా ఉంటుందంటే, థాయ్ క్లాసిక్ లు, సీఫుడ్ మరియు ఫ్రెష్ ఫ్రూట్స్. ముఖ్యంగా పండ్లు వారే అక్కడ సహజ ఎరువులతో పండిస్తారట. ఇలా చేయాలనీ ఆలోచించిన మహోన్నత వ్యక్తి ఎవరో తెలుసా... గ్రాహం గ్రాంట్ అనే సోనేవా కిరి రిసార్ట్ మేనేజర్ ఈ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ఇక్కడ కొంత సమయం గడిపామంటే మన జన్మ ధన్యమయినట్టే. స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. పక్షుల మధ్యన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మీరు కూడా ఈ ప్రదేశానికి వెల్లడినాయికి ట్రై చేయండి.
  

మరింత సమాచారం తెలుసుకోండి: