చాలామంది పెళ్ళి అయి ఎన్ని రోజులైనా పిల్లలు కలగక బాధపడుతుంటారు. దానికి కారణం మగ వారిలో వీర్య కణాలు వృద్ధి లోపం ఉండవచ్చు లేదా మహిళలో కొన్ని సమస్యలు అయి ఉండవచ్చు. ఇలాంటి వారు ఆయుర్వేద ఔషదాలు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి వారికి జాజికాయ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

జాజికాయలో కోరికలు పెంచే లక్షణాలు పుష్కళంగా ఉంటాయి.ఇది మగవారిలో వీర్యకణవృద్ధికి సహాయపడుతుంది.రాత్రి పడుకోబోయేముందు అర స్పూన్ జాజికాయ పొడిని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు.

జాజికాయను సన్నని మంటపై ఒక కడాయి లో నెయ్యి వేసి వేయించి పొడి చేసుకుని గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని ఐదు గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం గ్లాస్ పాలతో కలిపి త్రాగాలి.మగవారిలో నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్య వృద్ధికి తోడ్పడి సంతాన సౌఫల్యాన్ని కలిగిస్తుంది.

అంతే కాక జాజికాయలో జాండిస్ కు ఉపశమనం కలిగిస్తుంది. నాలుకమీద పేరుకుపోయిన పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లలకు సాధారణంగా కలిగే నీళ్ళ విరేచనాలను కలిగించే గుణాలను తొలగిస్తుంది.ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్దకాన్ని తొలగిస్తుంది.జాజికాయ, సొంఠి అరగదీసి నొప్పీ వున్నచోట పట్టు వేస్తే తలనొప్పి, మైగ్రేన్‌ వంటి నొప్పీ నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది.

నిద్ర లేమితో బాధపడేవారికి జాజికాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చెంచా తేనెను చిటికెడు జాజికాయ పొడిని కలపి ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగితే మంచి నిద్రపడుతుంది.

ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగి చర్మం అందంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయి.

సూర్యుని నుండి వచ్చే అతినిలలోహిత కిరణాల వల్ల ట్యాన్ అయినా చర్మానికి జాజికాయ పొడిని, తేనెలో కలిపి, నల్లగా అయిన ప్రదేశంలో లేపణంగా రాసి ఒక 10 నిమిషాల తరవాత చల్లటినీటితో కడిగితే ట్యాన్ మొత్తం పోతుంది. చికెన్ ఫాక్స్, గవద బిళ్ళలతో బాధపడేవారు జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని భోజనం చేసే ముందు అర టీ స్పూన్ మొదటి ముద్ద తో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.I

మరింత సమాచారం తెలుసుకోండి: