
ఘాటు వాసనను కలిగి ఉండే ఈ మొక్క మంచి సువాసనను అందిస్తుంది.. ఈ మొక్కలకు పెద్దగా నీరు కానీ జాగ్రత్తలు కానీ అవసరం లేదు. ఈ మొక్కలోని ఒక కాడను తెంపి భూమిలో నాటారంటే అది పెద్ద మొక్కగా పెరుగుతుంది సువాసనలు వెదజల్లుతూ ఇంటి అందాన్ని కూడా పెంచుతుంది.. ఇంటి ఆవరణలో లేదా గుమ్మం దగ్గర పెంచినట్లయితే.. గాలి వచ్చే చోట పెట్టినప్పుడు ఈ మొక్క నుంచి సువాసనలు వస్తూ ఉంటాయి. దీనిని పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది.. వాము ఆకులతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మాత్రం వీటిని తినిపించకూడదు.
ఆకులను వాడితే గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందట లేదంటే పుట్టే బిడ్డకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆకులలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలోని అధిక కొవ్వును కూడా కరిగిస్తుంది. ఒకవేళ తినలేని పరిస్థితుల్లో కొన్నింటిని కడిగి వేడి నీటిలో మరిగించి.. ఆ నీరు మూడోవంతు వరకు తగ్గాక వడకట్టి ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఎటువంటి సమస్యల నుంచైనా ఉపశమనం పొందవచ్చు.