
ఇక ఇలాంటివి చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వారూ సైతం ఆశ్చర్యపోతారు. పెళ్లయిన తర్వాత భార్యతో ఇంత టార్చర్ ఉంటుందా? ఇక అన్ని భార్య కంట్రోల్ లోనే ఉంటాయో.. భార్య ఎంత చెబితే అంతేనా.. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు మాత్రమే భర్త అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తూ ఉంటాడా.. ఇక ఆ తర్వాత భార్య చేతుల్లోకి అంత కంట్రోల్ వెళ్ళిపోతుందా అన్నది ఎంతోమందిలో ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదండోయ్ అటు సినిమాల్లో సైతం ఇక ఇలా భార్యా భర్తను కంట్రోల్ చేస్తుంది అన్నట్లుగా కొన్నిసన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి.
దీంతో ఇటీవల కాలంలో భార్య అంటే టార్చర్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ భార్య టార్చర్ కాదు బాధ్యత అని కొంతమంది భర్తలు నిరూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక భర్త భార్య చనిపోయిన తర్వాత ఆమెను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఏకంగా గుడి కట్టేసాడు. భార్య ఉన్నన్నాళ్లు గుండెల్లో పెట్టుకుని చూసుకున్న భర్త ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత గుడి కట్టేసాడు. తమిళనాడు కోయంబత్తూరు సమీపంలో నివసించే పలన స్వామి భార్య సరస్వతమ్మ అనారోగ్యంతో మరణించడంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే ఆమె జ్ఞాపకంగా ఒక గుడి కట్టి రోజు పూజలు చేస్తూ ఉన్నాడు.