చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా ఇత్తడి పాత్రలు అనేవి ఎన్నో కొన్ని ఉండనే ఉంటాయి.. పూర్వపు రోజుల్లో వీటిని ఎక్కువగా వాడేవారు..ఈ పాత్రలో వంటలు కూడా చేసుకునేవారు పూర్వికులు..కానీ ఇప్పుడు వీటిని చాలా తక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. ఇతర పాత్రలతో పోలిస్తే ఇత్తడి పాత్రలు త్వరగా మరకలు ఏర్పడతాయి..నల్లగా కూడా మారుతూ ఉంటాయి. వీటిని శుభ్రం చేయాలి అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే ఈ పాత్రలను క్లీన్ చేయడానికి గంటల సమయం వృధా అవుతుంది.. అయితే ఇత్తడి పాత్రలను శుభ్రం చేయాలనుకునేవారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల వాటితో ఆ పాత్రలు మొత్తం తల తల మెరిసిపోతాయి.



బేకింగ్ సోడాను ఎక్కువగా వంటలలో మనం ఉపయోగిస్తూ ఉంటాము..ఈ బేకింగ్ సోడాతో సామాన్లను కూడా శుభ్రం చేసుకోవచ్చు.. బేకింగ్ సోడాను ఉపయోగించి ఇత్తడి పాత్రలను శుభ్రం చేయవచ్చు దీనివల్ల తెల్లగా మెరుస్తాయట.


వెనిగర్ తో కూడా ఇత్తడి పాత్రలను ఇత్తడి విగ్రహాలను సైతం తిక్కితే నలుపు తిరిగిన వాటిని కూడా తెల్లగా మారుస్తుందట. వెనిగర్ ఉపయోగించడం వల్ల ఇత్తడి వస్తువులు ఎప్పుడూ కొత్త వాటి లాగానే మెరుస్తూ ఉంటాయి. అయితే కాస్త వెనిగర్ వేసి కొన్ని నీటిని పోసిన తర్వాత అందులో ఇత్తడి సామాన్లను పెట్టి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టిన తర్వాత తిక్కితే త్వరగా తెల్లగ అవుతాయి.


ఇత్తడి పాత్రలకు ఏదైనా పుల్లటి స్వభావం కలిగి ఉన్న వాటిని తగిలితే కచ్చితంగా తెల్లగా అవుతాయి.. ముఖ్యంగా నిమ్మకాయ, ఉప్పు వంటి వాటిని కలిపి ఇత్తడి సామాన్ల పైన తిక్కుతే ఉప్పులో ఉండే ఆమ్లాలు నిమ్మకాయలో ఉండేటువంటి ఆమ్లాలు నల్లగా ఉన్నటువంటి ఇత్తడి సామాన్లను తెల్లగా మారుస్తాయి.. అందుకే ఇత్తడి పాత్రలను క్లీన్ చేసేటప్పుడు ఈసారి ఇలాంటి చిట్కాలను పాటించడం వల్ల అవి సులువుగా తెల్లగా మారుతాయి. దీనివల్ల సమయం కూడా సేవ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: