జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటాలని టీమిండియా భావిస్తుంది. గత కొన్నేళ్ల నుంచి వరల్డ్ కప్ టోర్నీలలో టైటిల్ గెలవలేక పోతుంది టీమిండియా. అయితే ఇక ప్రపంచ కప్ లో ప్రస్థానం పరంగా మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఉన్నప్పటికీ.. ఎందుకో టైటిల్ వేటలో మాత్రం సక్సెస్ కాలేక పోతుంది. అప్పటివరకు అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోయిన టీమిండియా  ఆ చివరి అడుగులో మాత్రం ఇక తడబడుతూ ఓటమి చవిచూస్తూ టైటిల్ ను ముద్దాడ లేకపోతుంది.


 గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇలాగే అభిమానులు అందరిని కూడా నిరాశపరిచింది. అయితే ఈసారి మాత్రం అద్భుతమైన ఆట తీరుతో టి20  వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగడానికి సిద్ధమైంది. కాగా మరికొన్ని రోజుల్లో అన్ని దేశాలు క్రికెట్ బోర్డులు కూడా టి20 జట్టు సభ్యుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఇదే విషయంపై కసరత్తులు చేస్తుంది. కాగా ఎవరు t20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.



 ఈ క్రమంలోనే అటు కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు అన్నది తెలుస్తుంది. టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఉండాల్సిందే అని కెప్టెన్ రోహిత్ శర్మ పట్టు పట్టాడట. ఇక ఇదే విషయాన్ని సెలెక్టర్లకు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. అతని స్వభావం ఈ మెగా టోర్నీలో టీమిండియాకు కలిసి వస్తుందని రోహిత్ చెప్పాడట. కాగా మే ఒకటవ తేదీతో ఇక టి20 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసేందుకు ఐసీసీ ఇచ్చిన డెడ్లైన్ ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు ఇక వరల్డ్ కప్ జట్టు ప్రకటన ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: