వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ కాలం పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఫ్రిజ్ వాటర్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్లీజ్ వాటర్ కంటే కుండ మంచినీళ్లు చాలా చల్లగా బాగుంటాయి. కుండలో నీళ్లు చాలా చల్లగా కూడా ఉంటాయి. పూర్వకాలంలో కుండలో నీళ్ళే తాగే వారు. జనరేషన్ మారుతున్న కొద్ది ప్రతి ఒక్కరు ఫ్రీజ్ లో వాటర్ ని తాగుతున్నారు ఇప్పుడు. ఫ్రిజ్ వాటర్ కంటే కుండనీరు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఫ్రిజ్ వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వేసవి సీజన్లో ఎండలు మండిపోతున్న సమయంలో మట్టి కుండలో నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పురాతన కాలం నుండి భారతదేశంలో గృహాల్లో మట్టికుండలను నీటిని చల్లగా ఉంచడానికి ఉపయోగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాంప్రదాయ పద్ధతి కేవలం నీటిని చల్లగా ఉంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మట్టి కుండను ప్రతి 2-3 రోజులకు ఓసారి శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కడిగి తాజా నీటిని నింపాలి. కడిగేటప్పుడు సబ్బు లేదా డిటర్జెంట్ ఉపయోగించకూడదు, వేడి నీటితో, గట్టి బ్రష్ తో శుభ్రం చేయాలి. ఎందుకంటే సబ్బు మట్టిలో చేరి నీటిని కలుషితం చేయవచ్చు. మట్టి కుండ నీరు శరీర ఉష్ణోగ్రతను నియంతరిస్తుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వేసవిలో ఆరోగ్యకరమైన ఎంపిక. మట్టి కుండల ఉపరితలంపై ఉండే సూక్ష్మ అందాల ద్వారా నీరు ఆవిరై, సహజంగా చల్లబరుస్తుంది. ఈ నీరు రిఫ్రిజిరేటర్ నీటిలో అతి చల్లగా ఉండదు, కాబట్టి ఇవి తాగిన జలుబు లేదా గొంతు నొప్పి వంటివి రావు. మట్టి క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఆమ్లన్ని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల ఆమ్లత్వం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మట్టి కుండల సూక్ష్మ రంద్రాలు నీటిలో ని కలుషితాలను ఫిల్టర్ చేస్తాయి. వీటిని స్వచ్ఛంగా, సురక్షితంగా చేస్తాయి. వేసవిలో సన్ స్ట్రోక్, డిహైడ్రేషన్ సమస్యలను నివారించడానికి మట్టికుండ నీరు సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఖనిజాలు, పోషకాలను కాపాడుతుంది. కాబట్టి మట్టికుండ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.
మరింత సమాచారం తెలుసుకోండి: