
మాంసాహార ప్రియులకు ఆదివారం చాలా చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి . చాలా దేశాల ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు అలాగే స్థానిక చట్టాల ప్రకారం తమ ఉద్యోగులకు వారానికి ఓరోజు ఇవ్వాల్సిన సెలవు దినాన్ని ఆదివారంగా ఎంచుకున్నారు . ఆ కారణంగానే ఆదివారం సెలవుగా ప్రకటిస్తారు . వారం మొత్తం కష్టపడి ఒళ్ళు అలసిపోయి మైండ్ పనిచేసి చేసి ఒత్తిడికి గురైపోతుంది. శరీరానికి మైండ్ కి రిలాక్సిలేషన్ కోసం ఇలా సెలవు ఇస్తారు. ఒక్కరోజు సెలవు తీసుకోవడం కారణంగా బాడీ మొత్తం ట్రిగర్ అవుతుంది అని .. ఆ కొత్త ఎనర్జీ మరో వారానికి సరిపడిపోతుంది అని .. ఆ కారణంగానే ఆదివారం సెలవు ఇస్తూ ఉంటారు .
అయితే ఆదివారం స్కూళ్ళకి ..కాలేజీలకి ప్రతి ఒక్క సంస్థకి సెలవు కావడంతో అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి వీలుగా ఉంటుంది . ఆదివారం రోజున తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే సమయంలో మాంసాహారం తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు . అలా కలిసి కూర్చొని మాంసాహారం తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది . అలా మానవజాతి ఆవిర్భావం నుండే నాన్ వెజ్ తినడానికి మనిషి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఆదివారం రోజు చికెన్ - మటన్ -చేప వంటి మాంసాహారాలను ఎక్కువగా తీసుకునేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .
ఫ్యామిలీ అంతా ఓకే చోటు ఉంటుంది . కలిసి సరదాగా వండుకొని తినొచ్చు . రెస్ట్ తీసుకోవచ్చు అంటూ ఆదివారం పూట ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటారు. నిజానికి ఇది ఒక సాంప్రదాయం లానే కానీ రాను రాను కాలక్రమేనా ఈ సాంప్రదాయం సంస్కృతిగా మారిపోయింది . ఆదివారం వస్తే చాలు మాంసాహారం తినాల్సిందే . దాదాపు ప్రతి ఒక్కరు ఇలానే చేస్తూ ఉంటారు . ముక్కలేనిది ముద్ద దిగదు . ఆదివారానికి అలాంటి ప్రత్యేకత ఉంది . అయితే కొంతమంది మాత్రం ఆదివారం నాన్ వెజ్ తినకూడదు అని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఆదివారం సూర్యుని దినం కాబట్టి . ఆ రోజు మాంసాహారం తినకూడదని నమ్మకం కొంతమందిలో ఉంది. కానీ వందలో 95 శాతం మంది మాత్రం నాన్ వెజ్ తినేస్తారు . మిగతా ఐదు శాతం మంది మాత్రమే సూర్యుడు కోసం తినకుండా మానేస్తారు..!