
దుర్గాప్రసాద్ అతని కుటుంబం కర్ణాటకలోని గంగావతిలో చాలా కిందటి స్థిరపడ్డారు . తెలుగువారైనప్పటికీ వివిధ కారణాలు చేత అక్కడే ఉండిపోయారు. దుర్గాప్రసాద్ కి 34 ఏళ్లు వచ్చిన పెళ్లి అవ్వలేదు ఎన్ని సంబంధాలు చూసిన ఏదో ఒక రీజన్ తో కుదరకుండా పోతుంది ..ఆయన కి పెళ్లి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది . దీంతో తెలిసిన వాళ్ళకి బ్రోకర్లకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అంటూ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు . అయితే ఇదే మూమెంట్లో దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు శ్రీదేవి అని తెలిసిన మహిళా ద్వారా ఒక సంబంధం ఉంది అంటూ తెలుసుకున్నారు. శ్రీదేవి ద్వారా కొంతమంది మధ్యవర్తుల ద్వారా దుర్గాప్రసాద్ కి ఎట్టకేలకు విజయవాడ కి సంబంధించిన అమ్మాయితో పెళ్లి జరిపించారు .
అయితే అంతకుముందే పెళ్లి చూపుల్లో వధువు తల్లిదండ్రులకు బాగోలేదు అని వైద్యం కోసం కొంచెం డబ్బులు కావాలి అంటూ దుర్గాప్రసాద్ దగ్గర రెండు లక్షలు వసూలు చేశారు . అలాగే మ్యారేజ్ బ్రోకర్లకు అంటూ రెండు లక్షలు వసూలు చేశారు. మొత్తంగా పెళ్లికి ముందే దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి నాలుగు లక్షల వరకు గుంజేసుకున్నారు ఆ మోస గాళ్లు . జూన్ 5వ తేదీ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గాప్రసాద్ కి పెళ్లి జరిపించారు . ఇన్నాళ్లకు పెళ్లయిందిలే ఇక తన కొడుకు జీవితం బాగుంటుంది అంటూ సంతోషపడిపోయారు ఆ తల్లిదండ్రులు . అయితే పెళ్లి తర్వాతే అసలు విషయం బయటపడింది . పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజు అసలు దుర్గాప్రసాద్ ని ముట్టుకొనే ముట్టుకోనివ్వలేదు ఆ మహిళ .
అంతే కాదు తర్వాత కూడా దుర్గాప్రసాద్ ని దూరం పెడుతూ వచ్చింది . సడన్గా యువతి సోదరుడు తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు అంటూ దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి మరో 50 వేలు తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడే అసలు నిజం బయటపడింది. ఆ యువతి కాపురం చేయకపోవడం ..? ఇలా ఎవరో ఒకరు దుర్గాప్రసాద్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండడంతో.. అసలు విషయం ఏంటని ఆరాతీస్తే ఆ యువతికి ఆల్రెడీ పెళ్లయిందని ..ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చావు కబురు చల్లగా చెప్పింది. అంతేకాదు భర్త వదిలేయడంతో పిల్లలను చూసుకోవడానికి రకరకాలుగా కష్టపడుతూ వస్తుందట. అంతేకాదు ఇలా మూడు రోజులు పెళ్లికూతురుగా నటిస్తే 50,000 ఇస్తామంటూ డీల్ కుదుర్చుకొని మరి ఈ పెళ్లి చేసుకునేలా వాళ్ళు బలవంతం చేశారట . ఇదే విషయాన్ని మహిళ దుర్గాప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో చేసేది ఏమీ లేక దుర్గాప్రసాద్ కుటుంబం నోరెళ్లబెట్టింది. మోసపోయామని గుర్తించి విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది . పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు . అసలు ఈ విషయంలో తప్పు ఎవరిది..? అనే విధంగా విచారణ ప్రారంభించారు..!