
అరటిలో ఉన్న మాగ్నీషియం అధికంగా శరీరంలోకి చేరి హృదయానికి ప్రభావం చూపొచ్చు. అరటిపండు సహజంగా శరీరాన్ని చల్లబరిచే ఆహారం. చలికాలంలో రాత్రివేళ తినడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అరటిలో సహజ చక్కెరలు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. ఒక అరటిపండు సరిపోతుంది – అది కూడా రోజుకు ఒకటికి మించి కాకూడదు. ఇంట్లో అరటిపండ్లు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించి ఒక్కసారి 3–4 అరటిపళ్లు తినడం కూడా శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక కార్బోహైడ్రేట్లు, షుగర్లు శరీర బరువు పెరగడానికి దారితీస్తాయి.
అరటిపండ్లతో పాటు చక్కెర కలిపి తినకండి – బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అరటి తిన్న వెంటనే పడుకోకండి – ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఆసిడిటీ ఎక్కువగా ఉన్నవారు పసిపండ్లు తినడం తప్పించండి – వాటిలో పేగులకు మంట కలిగించే లక్షణాలు ఉండొచ్చు. అలర్జీ ఉన్నవారు శ్రద్ధవహించాలి – అరటిపై అలెర్జీ ఉన్నవారికి చర్మం ఎర్రబడ్డడం, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. పూర్తిగా పండిన అరటిపండు మధ్యాహ్న భోజనం తర్వాత తినండి. మితంగా తినండి – రోజుకు ఒకటి లేదా రెండు చాలు. అరటిని న్యూట్రి షేక్ లేదా మిల్క్‌షేక్‌గా కాకుండా సహజంగా తీసుకుంటే మంచిది. అరటి తినిన తర్వాత వెంటనే నీరు తాగకుండా కొంత గ్యాప్ ఇవ్వండి.