చాలామంది అనుకుంటూ ఉంటారు . డిస్కౌంట్ లో ఉన్న బోర్డ్ కనపడగానే భారతీయులు ఎగేసుకొని వెళ్ళిపోతారు అని .. ఫుల్ గా కొనేస్తారు అని..అమెరికాలో వివిధ దేశాలలో ఇండియన్స్ ఆఫర్స్ ఉన్నాయి అంటూ  ఎగేసుకుని కోనుకునేస్తారు అంటూ విదేశీయులు చులకనగా చూస్తూ ఉంటారు . కొన్నిసార్లు తక్కువ చేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు . అయితే విదేశీయులు కూడా అందుకు ఏమీ తీసిపోరు అని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణ . ఈస్ట్ లండన్లోని వైట్ చేపల్  ప్రాంతంలో ఉన్న స్పేయిన్బరి స్టోర్లో ఆఫర్ పెట్టారు .

బాస్మతి రైస్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు.  ఇంకేముంది డిస్కౌంట్ పెట్టి పెట్టగానే బాస్మతి రైస్ బ్యాగుల కోసం కస్టమర్లు ఎగబడి పోయారు. అసలు ఇక ఉంటామో పోతామో అన్న విధంగా అమదరు రైస్ బ్యాగ్స్ ని కొనుక్కునేశారు.  ఉదయం కాదు రాత్రి కాదు ఆడ కాదు మగా కాదు ఆషాడం కేజీ సేల్ అమ్మే క్లాత్ షోరూం లో మాదిరిగా క్యూ లైన్ లో నిలుచొని మరి ఒక్కొక్కరు 10 - 12  - 14 బస్తాలను వేసుకొని వెళ్లిపోయారు . ఇక అసలు బాస్మతి రైస్ దొరకవా..? ఇదే ఆఖరి క్షణాలా..? అన్న రేంజిలో అక్కడి జనాలు బాస్మతి రైస్ ప్యాకెట్స్ కొనుగోలు చేశారు.



దీంతో ఇదేదో విచిత్రంగా ఉందే అంటూ వీడియో తీసి అక్కడ ఉండే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ..అది కాస్త వైరల్ గా మారింది.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక్కో రైస్ బ్యాగ్ ను డిస్కౌంట్ పై 9.50 పౌండ్లకు  అమ్మేసారు.  దీంతో కస్టమర్లు హడావిడి ఓ రేంజ్ లో ఉండింది . సాధారణంగా ఇలాంటివి ఎక్కువగా ఇండియాలో చూస్తూ ఉంటామని ఫారెనీర్స్ ఎగతాళి చేస్తూ ఉంటారు . ఇప్పుడు ఫారెన్  లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటూ భారతీయులు కూడా భారీ రేంజ్ లో కౌంటర్స్ వేస్తున్నారు..!





మరింత సమాచారం తెలుసుకోండి: