"బిర్యానీ" అనే పదాన్ని  వినగానే అందరికి నోరు ఊరిపోతుంది.  నోరంతా రుచిరంగా, సువాసనతో నిండిపోయిన అనుభూతి కలుగుతుంది. చాలామందికి బిర్యానీ ఒక ఫుడ్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. బిర్యానీ లేకుండా కొంతమంది బ్రతకలేరు. ముఖ్యంగా భారతీయులు బిర్యానీని చాలా ఇష్టపడతారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇష్టపడే భోజనాలలో బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి, ఒక సంస్కృతి, ఒక రుచికరమైన అనుభవం. ప్రపంచవ్యాప్తంగా కూడా బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.


బిర్యానీ అనేక రకాలుగా తయారు చేస్తారు. వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోబీ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇందులో సువాసన గల బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసి మాంసం, కాయగూరలు, సువాసన ద్రవ్యాలతో తయారు చేస్తారు. ప్రతి ఒక్కరు బిర్యానీ తినగానే గొప్ప రుచి, ఆహ్లాదకరమైన సువాసనను ఆస్వాదిస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ వంటి రకాలు అత్యంత పాపులర్‌గా ఉన్నాయి. ఏ పండగ, ఏ వేడుక, ఏ సంబరమైనా బిర్యానీ తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్లి, పిల్లల పుట్టినరోజు, ఏ పార్టీ అయినా—బిర్యానీ తప్పనిసరిగా వుంటుంది. వెజ్ లేదా నాన్-వెజ్ అన్నది పక్కన పెట్టి, బిర్యానీ అనే పదమే అందరికీ ఒక కామన్ ఎమోషన్‌కి రూపం.



బిర్యానీ అనే పదం ఎలా వచ్చిందో చాలామంది తెలియదు. బిర్యానీ అనేది "బిర్యాన్" అనే పరిషయన్ పదం నుండి ఉద్భవించింది.  దీని అర్థం “పంటకు ముందే వేయించి ఉంచినది” అని ఉంటుంది. ఇంగ్లీష్‌లో బిర్యానీని సాధారణంగా "మిక్స్డ్ రైస్"  అని పిలుస్తారు. బిర్యానీని 16వ శతాబ్దంలో మొగలులు భారతదేశానికి పరిచయం చేశారు అనేది చరిత్ర చెబుతుంది.  ఆ సమయానికి ఇది ఒక అద్భుతమైన వంటగా అనుకునేవారు. కాలక్రమీనా ఈ బిర్యానీ అనేక విధాలుగా మారి, వివిధ రకాలుగా తయారయ్యింది. హైదరాబాద్  దమ్ బిర్యానీ, కచ్చీ బిర్యానీ, ఈస్ట్ కోస్ట్ మరియు వెస్ట్ కోస్ట్ స్పెషల్ బిర్యానీలు...ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన రుచులు ఉన్నాయి.



ఎటువంటి పరిస్థితుల్లోనైనా బిర్యానీ ఒకరిని మది మురిపించేలా, సంతోషం నింపేలా ఉంటుంది. యువత దీన్ని హెల్తీగా తీసుకుంటే, ఆరోగ్యానికి హానికరం చేయకుండా ఆస్వాదించవచ్చు. కానీ అధికంగా, లేదా ఎక్కువ మసాలాలు వేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. చాలా మంది బిర్యానీ కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక సంస్కృతి, ఒక అనుభూతి, ఒక సువాసన, మరియు మనిషి జీవితంలో తీనదగిన రుచికరమైన అనుభవం. బిర్యానీ అంటే కేవలం తినడం కాదు..బిర్యానీ అంటే  రుచి, సువాసన, ఆనందం మరియు సంబరాల సమ్మేళనం.,అంటుంటారు కొంతమంది బిర్యానీ లవర్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: