ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్...గతంలో కాంగ్రెస్ కంచుకోట..ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ సార్లు విజయం సాధించింది. ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కొల్లాపూర్ నిదానంగా జూపల్లి కృష్ణారావు అడ్డాగా మారిపోయింది. ఆయన ఎంట్రీతో కొల్లాపూర్‌లో సీన్ మారింది. 1999 ఎన్నికల్లో ఆయన తొలిసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు...2004లో ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. 2009లో మరొకసారి కాంగ్రెస్ నుంచి సత్తా చాటారు. అయితే మధ్యలో టీఆర్ఎస్‌లోకి వెళ్ళి ఉపఎన్నికలో కొల్లాపూర్ నుంచి గెలిచారు. 2014లో మరొకసారి టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు.

అయితే 2018 ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయింది...జూపల్లిపై కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. గెలిచాక హర్షవర్ధన్ కాంగ్రెస్‌ని టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. దీంతో కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో రెండు గ్రూపులు నడుస్తున్నాయి. ఇక ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయనే హర్షవర్ధన్ టీఆర్ఎస్‌లోకి వచ్చారనే ప్రచారం ఉంది. పైగా ఈయన అధికార పార్టీలోకి వచ్చిన అంతగా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.

నియోజకవర్గంలో గ్రూపు గొడవలతోనే సగం సమయం అయిపోతుంది. అభివృద్ధి పెద్దగా జరగడం లేదు. చిన్నాచితక పనులు జరుగుతున్నాయి గానీ, పూర్తి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి బాటపట్టలేదు. సాగునీరు, తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి...కొల్లాపూర్ మున్సిపాలిటీ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. అటు కొల్లాపూర్ కోట చుట్టూ ఆక్రమణలు ఎక్కువ అయిపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి.

రాజకీయంగా చూస్తే...కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌కు నెగిటివ్ ఎక్కువగానే ఉంది..నెక్స్ట్ ఈయనకు సీటు ఇస్తే కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ గెలుపు కష్టమే...అయితే సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుకు ఇస్తే ప్లస్ ఉంటుంది. ఒకవేళ ఈయనకు సీటు దొరకపోతే కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కూడా కాస్త పికప్ అయింది. అయితే టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్య బీజేపీకి పెద్దగా ఛాన్స్ దొరకకపోవచ్చు..ఏదేమైనా కొల్లాపూర్‌లో జంపింగ్ ఎమ్మెల్యే కారు మాత్రం రివర్స్‌లో వెళుతుంది..నెక్స్ట్ జూపల్లికి సీటు ఇస్తే ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: