తెలుగు,తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో మెరిపిస్తూన్న చిన్నది రాయ్ లక్ష్మీ. తెలుగులో ఆ మద్య కాంచన చిత్రంలో లారెన్స్ సరసన నటించింది. బలుపు చిత్రంలో మాస్ మహరాజ రవితేజ సరసన ఐటమ్ సాంగ్ లో కనిపించింది. తాజగా పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ లో కూడా ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇక లక్ష్మీరాయ్ తమిళ, కన్నడంలో హీరోయిన్ గా మంచి పేరుంది.


ఆ మద్య బాలీవుడ్ లో ‘జూలీ’ సినిమా వచ్చింది..ఈ చిత్రంలో నేహా ధూపియా చాలా హాట్ హాట్ గా నటించింది. ఒక్క దెబ్బతో ఈ అమ్మడికి ఒక్కసారిగా స్టార్ డమ్ పెరిగిపోయింది.  ఈ ఒక్క మూవీతో దశాబ్ధం కెరీర్ ని సునాయాసంగా లాగించేసింది అమ్మడు. పది సంవత్సరాల క్రితమే అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రంగా ఒక్క ఊపు ఊపింది. ఈ అమ్మడిని చూడటానికి జనాలు పిచ్చెక్కిపోయారు..ఉత్తరాదిన విజయం సాధించిన జూలీ ఆ తర్వాత సౌత్ లాంగ్వేజెస్ లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో విచ్చలవిడి శృంగారంతో నేహా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయింది. మొత్తాని ‘జూలీ’ సినిమా బాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది.


‘జూలీ’ చిత్రంలో నేహా ధూపియా



తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది..అయితే ఈ సారి ఆ పాత్రలో నేహా ధూపియా కాదు అందాల భామ రాయ్ లక్ష్మీ. ఇక ఈ సినిమాలో హీరోగా రేసు గుర్రం, కిక్ 2 లో నటించిన రవికిషన్ హీరోగా నటించ బోతున్నాడట.  ప్రస్తుతం ఇందులోని ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఆన్ సెట్స్ ఫోటోలు నెట్ లో లీకయ్యాయి. ఈ చిత్రంలో కూడా రాయ్ లక్ష్మీ అప్పటి నేహా ధూపియాను మరిపించ నుందా అని అనుకుంటున్నారు..బికినీలో ఈ అమ్మడు కనిపిస్తే కుర్రకారు మతులు పోవడం ఖాయం. నేహాని మించి రాయ్ లక్ష్మిలోని అందాలు తెరపై కనువిందు చేస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని దీపక్  తీస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: