క్లాసికల్ డ్యాన్సర్ అయినా సరే విమలా రామన్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించలేకపోయింది. ఇక ఇమేజ్ కోసం కాస్త హాట్ హాట్ సినిమాల్లో రొమాంటిక్ గా నటించినా అవేవి అమ్మడికి హెల్ప్ అవ్వలేదు. అయితే కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న అమ్మడికి సడెన్ గా ఓ లక్కీ ఆఫర్ తలుపు తట్టింది. అది అలాంటిలాంటి ఆఫర్ కాదు ఏకంగా కింగ్ నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్. 


మనం, ఊపిరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యువ హీరోల కన్నా రేసుగుర్రంలా హిట్స్ తో దూసుకెళ్తున్న నాగార్జున తన తర్వాత సినిమా హథిరాం బాబా జీవిత కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగ్ మరోసారి భక్రి పారవశ్వంతో ముగినితేలనున్నారు.


ఇక ఈ సినిమాలో ఇప్పటికే కంచె భామ ప్రగ్యా జైశ్వాల్, హాట్ గాళ్ అనుష్క ఓకే అవగా.. మరో ముద్దుగుమ్మ విమలా రామన్ కూడా సెలెక్ట్ అయ్యిందట. కాస్టింగ్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఓ ఇంపార్టెంట్ రోల్ కు డ్యాన్స్ అనుభవం ఉన్న హీరోయిన్ కావలనగా వెంటనే విమలా పేరు రిఫర్ చేశారట. సో అలా లక్కీగా విమలా హతిరాం బాబా సినిమాలో భాగమవనుంది.


విమలా రామన్ నాగార్జున ఇదవరకు కళ్యాణ్ జువెలర్స్ యాడ్ లో నటించారు. సో ఆ సన్నిహితంతోనే నాగ్ పిలిచి మరి ఈ సినిమాలో అమ్మడికి అవకాశం ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. సో ఎలాగైతేనేం విమలా రామన్ ఓ మంచి సినిమాతో కం బ్యాక్ అవుతుందన్నమాట. ఈ సినిమా అయినా అమ్మడి టాలీవుడ్ ఫేట్ మార్చుతుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: