రెండు రోజుల క్రితం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో మీడియా కెమెరాలకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ల మధ్య జరిగిన వ్యవహారం చిన్నప్పటి ఎలుకా, పిల్లి ఆటను గుర్తుకు చేస్తోంది. సల్మాన్ తను ప్రస్తుతం ప్రేమిస్తున్న రొమేనియా దేశపు అందగత్తే లులియా వాంటార్ తో రహస్యంగా హైదరాబాద్ వచ్చాడు. మీడియా కంట కనిపించకుండా ఏదో విధంగా ఎయిర్ పోర్ట్ బయటకువచ్చి కారు ఎక్కేద్దాం అనుకున్న సల్మాన్ ఆశలకు తెలుగుదేశ అధినేత చంద్రబాబు విలన్ గా మారారు.

 చంద్రబాబు నాయుడు ఉత్తరాంచల్ నుంచి వస్తున్నాడు అంటూ మీడియా కు వార్తలు రావడంతో చంద్రబాబు కవర్ చేద్దామని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన మీడియా కు దురదృష్టం కొద్ది సల్మాన్ తన ప్రేయసి తో మీడియా కెమెరాలకు చిక్కాడు. అనుకోని ఈ సంఘటనకు ఖంగుతిన్న సల్మాన్, తన సెక్యూరిటీ గార్డ్స్ తో తన ప్రేయసి లులియా ని కవర్ చేసి సల్మాన్ వేరే ద్వారం గుండా ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చేశాడు. అయినా అతడిని మీడియా కెమెరాలు విడిచిపెట్టలేదు.

హైదరాబాద్ లో జరుగుతున్న తన సినిమా ‘మెంటల్’ షూటింగ్ కోసం రహస్యంగా తన ప్రేయసి తో వచ్చిన సల్మాన్, ఇలా అడ్డంగా మీడియా కు ఎందుకు దోరికిపోయానా అని జుట్టు పీక్కున్నాడట. పాపం ఈ కింగ్ ఖాన్ కు తెలియదు అనుకుంటా, చంద్రబాబు వల్ల తాను బుక్ అయ్యానని. 48 సంవత్సరాలు ధాటిపోతున్నా, పెళ్ళి లేక బాధపడుతున్న సల్మాన్ కనీసం ఈ రుమేనియా బ్యూటీ తో అయినా పెళ్ళి పీటలు ఎక్కుతాడేమో చూడాలి. ఏది ఏమైనా సల్మాన్ లక్ కు చంద్రబాబు బ్యాడ్ లక్ గా మారారు అనుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: