ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అందరి హీరోలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తాను అందరి వాడిని అన్న ట్రేడ్ మార్క్ వేసుకున్నాడు. అదేవిధంగా ఎప్పుడు నవ్వుతూ కనిపించే దిల్ రాజ్ ఎవరి పై అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు గతంలో లేవు. అలాంటి దిల్ రాజ్ సడన్ గా తన రూట్ మార్చి యంగ్ హీరో రాజ్ తరుణ్ ను కార్నర్ చేస్తూ చేసిన కామెంట్స్ అందరిని  ఆశ్చర్యపరుస్తున్నాయి. 
Raj Tarun Lover Movie Trailer Released - Sakshi
రేపు విడుదలకాబోతున్న ‘లవర్’ మూవీ గురించి దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నాడన్న విషయం ఒపిన్ సీక్రెట్.  ఈమధ్య కాలంలో రాజ్ తరుణ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపధ్యంలో ఈసినిమా పై అనుకోకుండా 8 కోట్లు ఖర్చు అయిన నేపధ్యంలో ఈమూవీ గురించి తాను పడ్డశ్రమ గురించి వివరిస్తూ ఫ్లోలో రాజ్ తరుణ్ ను కార్నర్ చేసే విధంగా కొన్ని కామెంట్స్ చేసాడు దిల్ రాజ్.
Naalo Chilipi Kala Telugu Song Lyrics | Lover | Raj Tarun, Riddhi Kumar | anilyrics
రాజ్ తరుణ్ లాంటి హీరో పై 8 కోట్లు ఖర్చుపెట్టడం కేవలం తమ బ్యానర్ వేల్యూ కోసమే అని చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఇంత బడ్జెట్ తో రాజ్ తరుణ్ తో సినిమా తీయడం వర్క్ అవుట్ కాదని చెప్పిన దిల్ రాజు మాటల్లో కాస్త వ్యంగ్యం కనిపిస్తోంది. అదేవిధంగా తన బ్యానర్ లో ఎప్పటి నుంచో సినిమా చేయాలని  రాజ్ తరుణ్ అడిగడంతో ఇప్పటికి కుదిరింది అనిచెప్పడం కూడ రాజ్ తరుణ్ విలువ తగ్గించే మాటలుగా ఉన్నాయి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈసినిమాలోని ఐదు పాటలకు వేర్వేరు సంగీత దర్శకులను పెడదాం అని ఈమూవీ నిర్మాత హర్షిత్ తనకు సూచన ఇచ్చినప్పుడు రాజ్ తరుణ్ సినిమాకు ఇంతఅవసరమా అని తాను అన్నట్లు లీకులు ఇవ్వడం మరింత సంచలనంగా మారింది. దీనికితోడు ఈసినిమా గురించి తాను టెన్షన్ పడుతున్నాను అని చెప్పడమే కాకుండా రాజ్ తరుణ్ పక్కన పెద్ద హీరోయిన్లు చేయరని అతనికి హీరోయిన్ వెతికి సెట్ చేయటం పెద్ద సవాల్ అంటూ కామెంట్ చేయడం చూస్తూ ఉంటే రాజ్ తరుణ్ ను టార్గెట్ చేస్తూ దిల్ రాజ్ ఎందుకు ఇలా మాట్లాడాడు అన్నవిషయం సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: