ఈ మద్య బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ వివాహం.. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ పెళ్లి కాగానే.. అదే దారిలో రణ్వీర్-దీపికా, ప్రియాంకా, నిక్ జోన్స్‌లు రెడీ అయ్యారు. దీపికా, రణ్వీర్ పెళ్లి నవంబర్‌లో, ప్రియాంక పెళ్లి డిసెంబర్లో జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో జంట కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు.. కెవ్వు కేక కుర్రాళ్లను మత్తులో ఊగించిన భామ మలైకా అరోరా, బోని కపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్ జంట. వీరిద్దరూ కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నలభై ఏళ్ల ఈ సుందరి తన భర్త ఆర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న మలైకా విడాకుల తరువాత అర్జున్ కపూర్ తో కలిసి బహిరంగంగా తిరగడం మొదలుపెట్టింది. మిలాన్‌లో జరిగిన మలైకా బర్త్‌డేకు అర్జున్ కపూర్ ప్రత్యేకంగా హాజరవడం, ఆ తర్వాత తన ఫ్రెండ్స్ గ్రూపులోకి అర్జున్ను ఆహ్వానిస్తూ మలైకా స్పెషల్ పార్టీ అరేంజ్ చేయడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ మొదలయ్యాయి. గత కొంత కాలంగా పబ్లిక్ ప్లేసుల్లో హడావిడి చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఈవెంట్లు, పార్టీలకు ఈ ప్రేమ జంట సాక్ష్యంగా నిలుస్తున్నారు.
అంతే కాదు ఇటీవల జరిగిన ఓ షోలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్.. మలైకా ముందే ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తాజాగా ఈ జంట మరోసారి కలిసి కనిపించింది. ముంబైలో తమ స్నేహితులు ఏర్పాటు చేసిన దీపావళి పార్టీకి హాజరైన ఈ జంటను ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. ఈ నేపధ్యంలో మలైకా ఇబ్బంది పడింది.. అయితే అర్జున్ మాత్రం కోపం వ్యక్తం చేయకుండా చాలా కూల్ గా మలైకా చుట్టూ చేతులు వేసి ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లాడు. మరి ఈ పెళ్లైనా ముదురు భామను కుర్రాడు అర్జున్ కపూర్ చేసుకుంటే బోనీ కపూర్ ఫ్యామిలీ అందుకు ఒప్పుకుంటుందా? ఎలాంటి ట్విస్టులు, టర్నింగ్‌లు లేకుండా పెళ్లి జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.