బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి తృటిలో ప్రమాదం తప్పింది.  ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది.  ప్ర‌స్తుతం ఆయన నటిస్తున్న ‘జీరో’సినిమా షూటింగ్ లో అగ్ని ప్ర‌మాదం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ ముంబైలోని ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతుంది.  గతంలో కూడా పలు సినిమా షూటింగ్స్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు షాట్ సర్క్యూట్స్ వల్లనే జరుగుతున్నాయి.  

 Shahrukh's

ఓ పాట చిత్రీక‌ర‌ణ కోసం భారీ సెట్ వేయగా అందులో షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఆ సమయంలో షారుక్ ఖాన్ అక్కడే ఉన్నాడు..కానీ అక్కడ నుంచి వెంటనే తప్పించుకున్నారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన షూటింగ్ స్పాట్ కు చేరుకొని మంటలను అదుపుచేశారు. భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌తో అలుముకుంది. ఈ ప్రమాదంలో షూటింగ్ కోసం వినియోగించే పరికరాలు దగ్ధమయ్యాయి. 

fire-on-sets-of-shah-rukh-khan-starrer-zero

అయితే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో షారుక్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఇందులో షారూఖ్ మ‌రుగుజ్జు పాత్ర‌లో, దివ్యాంగురాలి పాత్రలో అనుష్క శర్మలు కనిపించనున్నారు.  ప్రమాదంలో సిబ్బందికి ఏమీ కాకపోవడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: