తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ఆ మద్య వరుస విజయాలతో దూసుకు వెళ్లాడు.  కిక్ 2, బెంగాల్ టైగర్ వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీకి రెండు సంవత్సరాలు దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ తర్వాత అనీల్ రావుపుడి దర్శకత్వంలో ‘రాజాది గ్రేట్’ చిత్రంతో మరోసారి మాస్ మహరాజ పవర్ ఏంటో చూపించాడు.   ఈ చిత్రం ఎంత గొప్ప విజయం సాధించిందో ఆ తర్వాత వచ్చిన మూడు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి.  దాంతో తన తదుపరి చిత్రం తప్పకుండా సక్సెస్ ను సాధించాలనే పట్టుదలతో వున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.  ఈ చిత్రం కొద్ది నెలల క్రితం నుంచే సెట్స్ పైకి వెళ్లినా ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. కథా కథనాలు మరింత పట్టుగా వచ్చేలా రవితేజ జాగ్రత్తలు తీసుకోవడంతో ఆలస్యమైంది. అంతే కాదు ఇప్పటి వరకు ఈ చిత్రం టైటిల్ కూడా ఖారారు కాలేదు. 
Image result for ravi teja
ఈ నెల  26 న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ లోగో రిలీజ్ చేయబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికలుగా నాభా నటేష్ .. పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: