హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో పెను సంచలనాలకు దారి తీసింది.  బాలీవుడ్ నటి తనూ శ్రీదత్తా గత పది సంవత్సరాల క్రితం తన కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ నటులు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని..ఆయనకు కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సైతం వంత పాడారని సంచలన ఆరోపణలు చేసింది.  ఆ తర్వాత కంగనా రౌనత్ సైతం గతంలో తనపై లైంగిక దాడులు బాగా జరిగాయని..ఇండస్ట్రీలో నటిగా ఎదగాలని ఆశించే వారిని లైంగికంగా లోబర్చుకొని వారి కోరికలు తీరిన తర్వాత బయటకు నెట్టి వేస్తారని..అలా ఎంతో మంది ఔత్సాహిక నటీమణులు ఈ దారుణాలకు బలైయ్యారని సంచలన ఆరోపణలు చేసింది. 
Image result for tanu sri dutta kangana
బాలీవుడ్ లో మరికొంత మంది సినీ రంగానికి చెందినవారే కాకుండా ఇతర రంగాల్లో వారు సైతం తమపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు.  ఇక దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కొంత కాలం క్రితం ప్రముఖ గేయ రచయిత వైరముత్తు లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు చేసింది.  టాలీవుడ్ లో అయితే నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాడిన విషయం తెలిసిందే.  సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై గత సంవత్సరం ఉవ్వెత్తున ఎగసిన 'మీటూ' ఉద్యమం ఇప్పుడు చప్పబడింది. దీని గురించి మాట్లాడుతున్న వారు, ఆరోపణలు చేస్తున్న వారూ ఎవరూ లేరు.
Image result for chinmayi vairamuthu
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హాట్ బ్యూటీ..ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మి మాట్లాడుతూ... 'మీటూ' ఉద్యమం వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించానని, దురదృష్టవశాత్తూ ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదని చెప్పింది. ఫేమస్ కావడానికి మరికొందరు 'మీటూ' అంటూ మీడియా ముందుకు వచ్చారని..కొందరు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తూ, తీవ్రతను తగ్గించారని ఆరోపించింది. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో వారికే తెలియదని వ్యాఖ్యానించింది. అందుకే ఇండస్ట్రీతో సంబంధం లేని ప్రజలు అసలు దీని గురించే మరిచిపోయారని రాయ్ లక్ష్మి పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: