టాలీవుడ్ లో మాస్ మహరాజా గా పేరు తెచ్చుకున్న రవితేజకు కొంత కాలంగా ఏమీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రవితేజ అనుకోకుండా హీరోగా మారారు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’సినిమాతో రవితేజ హీరోగా తన సత్తా చాటాడు.  ఆ తర్వాత రాజమౌళి తీసిన విక్రమార్కుడు, దుబాయ్ శీను, కిక్,  పవర్ లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందించాయి.  కిక్ 2, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అయిన తర్వాత రవితేజ రెండేళ్లు కనిపించకుండా పోయాడు. 

దాంతో ఆయన కెరీర్ కి పులిస్టాప్ పెట్టాడనుకున్న సమయంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో మెరుపులా మెరిసాడు.  హమ్మయ్య గాడిలో పడిపోయాడని అభిమానులు అనుకుంటే, ఆ తరువాత నుంచి పరాజయాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురుకొంటున్న రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సైన్స్ ఫిక్షన్ చేస్తున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ పాటికే మొదలుకావలసి వుంది. 

కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు..అయితే దీనికి కారణం నిర్మాతకీ .. రవితేజకి మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ను 40 కోట్ల నుంచి 30 కోట్లకి కుదించడం..అలాగే ఈ సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ తొలగించమని నిర్మాతలు చెప్పడంతో రవితేజకు ఎక్కడో కాలిందట. ఈ కారణంగానే షూటింగు ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు..ఫిలిమ్ వర్గాల్లో మాత్రం టాక్ వినిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: